సమ్మర్ స్పెషల్: చల్లచల్లని ఫ్రూట్స్ శ్రీఖండ్, కేసర్ డ్రైఫ్రూట్స్ లస్సీ ఇలా చెయ్యండి!

Published : Mar 15, 2022, 03:32 PM IST

వేసవి కాలంలో డ్రైఫ్రూట్స్, పండ్లతో చేసుకునే లస్సీలు ఎండ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అలాగే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. వీటి తయారీ విధానం కూడా సులభం.  

PREV
17
సమ్మర్ స్పెషల్: చల్లచల్లని ఫ్రూట్స్ శ్రీఖండ్, కేసర్ డ్రైఫ్రూట్స్ లస్సీ ఇలా చెయ్యండి!
Saffron Dry Fruits Lassi

కావలసిన పదార్థాలు: మూడు కప్పుల తాజా పెరుగు (Yogurt), ఒక యాపిల్ (Apple), ఒక అరటిపండు (Banana), ఒక సపోటా (Sapota), ఐదు ద్రాక్ష (Grapes), నాలుగు టేబుల్ స్పూన్ ల చక్కెర పొడి (Sugar powder), పావు స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), రెండు స్పూన్ ల పిస్తా (Pista) పలుకులు, రెండు స్పూన్ ల బాదం (Almonds) పలుకులు.
 

27
Saffron Dry Fruits Lassi

తయారీ విధానం: అరటి, ఆపిల్, ద్రాక్ష, సపోటా పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పల్చని వస్త్రంలో పెరుగులో (Yogurt) వేసి మూటలా కట్టి పిండితే నీళ్ళు అన్నీ పోతాయి. ఇలా తయారైన పెరుగును ఒక గిన్నెలో తీసుకొని అందులో చక్కెర పొడి వేసి మెత్తని క్రీంలా (Soft cream) వచ్చేలా గిలకొట్టాలి.
 

37
Saffron Dry Fruits Lassi

ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమంలో కట్ చేసుకున్న పండ్లను, యాలకులపొడి, పిస్తా పలుకులు, బాదం పలుకులు వేసి బాగా కలుపుకోవాలి (Mix well). ఈ గిన్నెను రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. రెండు గంటల తర్వాత బయటకు తీస్తే చల్లచల్లని ఫ్రూట్స్ శ్రీఖండ్ రెడీ (Ready).
 

47
Saffron Dry Fruits Lassi

కేసర్ పిస్తా లస్సీ:
కావలసిన పదార్థాలు: ఒకటిన్నర కప్పు పెరుగు (Yogurt), సగం కప్పు పాలు (Milk), ఒక టేబుల్ స్పూన్ పిస్తా (Pista) తరుగు, ఒక టేబుల్ స్పూన్ బాదం (Almonds) పలుకులు, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు (Cashew) పలుకులు.
 

57
Saffron Dry Fruits Lassi

పావు స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), ఒకటిన్నర టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు (Saffron), రెండు టేబుల్ స్పూన్ ల పాల మీగడ (Milk cream), రెండు టేబుల్ స్పూన్ ల పంచదార పొడి (Powdered sugar).
 

67
Saffron Dry Fruits Lassi

తయారీ విధానం: ముందుగా కాచి చల్లార్చిన పాలను (Milk) ఫ్రిజ్ లో పెట్టి గడ్డ కట్టించాలి. అలాగే చిలికిన పెరుగు (Yogurt) కూడా ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పిస్తా తరుగు, నానబెట్టిన బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, యాలకులపొడి, నానబెట్టుకున్న కుంకుమపువ్వు నీళ్లు, పాల మీగడ, పంచదార పొడి వేయాలి.
 

77
Saffron Dry Fruits Lassi

అలాగే ఇందులో ఫ్రిజ్ లో పెట్టి గడ్డ కట్టించిన పాల గడ్డ, చల్లని చిలికిన పెరుగును వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న లస్సీని గ్లాసులో తీసుకుని పైన డ్రైఫ్రూట్స్ (Dry Fruits) తో గార్నిష్ (Garnish) చేసి సర్వ్ చేయాలి. అంతే చల్లచల్లని కేసర్ పిస్తా లస్సీ రెడీ.

click me!

Recommended Stories