నోరూరించే వేడి వేడి క్యాలీఫ్లవర్ బైట్స్ ఓ సారి ట్రై చేయండిలా!

First Published Jan 1, 2022, 7:42 PM IST

చల్లటి సాయంత్రం వేళ ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా! ఎప్పుడూ రొటీన్ గా చేసుకునే స్నాక్స్ ఐటమ్స్ (Snacks Items) బోర్ కొడుతున్నాయా! అయితే క్యాలీఫ్లవర్ తో చేసుకునే ఈ స్నాక్ ఐటంను తప్పక ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ గా క్యాలీఫ్లవర్ బైట్స్ ను ట్రై చేయండి. దీని రుచికి తిరుగుండదు. దీని తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ  ఆర్టికల్ ద్వారా క్యాలీఫ్లవర్ బైట్స్ (Cauliflower bites) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: ఒకటిన్నర కప్పు కాలిఫ్లవర్ పువ్వులు (Cauliflower), సగం కప్పు బియ్యప్పిండి (Rice flour), రెండు పెద్ద బంగాళదుంపలు (Potato), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), సగం స్పూన్  సోంపు (Anise), కొంచెం పసుపు (Turmeric), ఒక స్పూన్ కారం (Red chilly powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), రెండు టేబుల్ స్పూన్  ల మొక్కజొన్న పిండి (Corn flour), కొత్తిమీర (Coriyander) తరుగు, ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil).
 

తయారీ విధానం: ముందుగా కాలీఫ్లవర్ ను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ లో పురుగులు (Worms) ఉంటాయి కనుక జాగ్రత్తగా శుభ్రపరుచుకోవాలి (Carefully clean). ఇందుకోసం స్టౌ మీద గిన్నె పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు, ఉప్పు, క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత నీటిని వంపి కాలిఫ్లవర్ ముక్కలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
 

ఇప్పుడు రెండు పెద్ద బంగాళదుంపను ఉడికించి తురుముకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో సగం కప్పు నీళ్ళు పోసి బాగా మరిగించాలి (Boil well). ఇలా నీరు బాగా మరుగుతున్న సమయంలో బియ్యప్పిండి (Rice flour) వేసి పిండి ఉండలు కట్టకుండా కలుపుకొని ఒక నిమిషం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
 

ఇప్పుడు ఇందులో క్యాలీఫ్లవర్ ముక్కలు, బంగాళదుంప తురుము, ఉల్లిపాయ ముక్కలు, సోంపు, కారం, పసుపు, కొత్తిమీర తరుగు, మొక్కజొన్న పిండి, రుచికి సరిపడా ఉప్పు ఇలా ఒక్కొక్కటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఢీ ఫ్రైకు సరిపడు ఆయిల్ (Oil) వేసి వేడి చేసుకోవాలి (Should be heated).
 

ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కాగుతున్న నూనెలో (Boiling oil) వేసి మంచి కలర్ వచ్చే వరకూ తక్కువ మంట (Low flame) మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బైట్స్ ను ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని ఫ్రై చేసుకోవాలి.
 

అంతే వేడి వేడి క్యాలీఫ్లవర్ బైట్స్ రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ క్యాలీఫ్లవర్ బైట్స్ ఒకసారి ట్రై చేయండి. ఇలా వెరైటీ (Variety) స్నాక్స్ ఐటమ్స్ ను తయారు చేసి మీ పిల్లలకు ఇస్తే వారు ఏ పేచీ లేకుండా తినడానికి ఇష్టపడతారు.

click me!