ఓట్స్ పొంగనాలు ఎప్పుడైనా తిన్నారా.. ఇలా ఇంట్లోనే ట్రై చేసి చూడండి!

First Published Dec 4, 2021, 2:20 PM IST

ఓట్స్ ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గాలనుకొనే వారు ఓట్స్ ని డైట్ లో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మనం ఓట్స్ తో ఉప్మా ట్రై చేసి ఉంటాం. ఇలా ఎప్పుడూ చేసుకునే రొటీన్ టిఫిన్ లను పక్కన పెట్టేసి కాస్త కొత్తగా ట్రై చేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఈ సారి వెరైటీగా ఓట్స్ తో పొంగనాలు ట్రై చేయండి. ఇది ఒక మంచి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ (Healthy Breakfast). ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఓట్స్ పొంగనాలు (Oats ponganalu) ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఓట్స్ (Oats), ముప్పావు కప్పు బొంబాయి రవ్వ (Bombai Ravva), పావు కప్పు బియ్యప్పిండి (Rice flour), ఒక కప్పు పుల్లటి పెరుగు (Sour yogurt), రెండు పచ్చిమిరపకాయలు (Green chillies), కొంచెం వంటసోడా (Baking soda), రుచికి సరిపడా ఉప్పు (Salt), తరిగిన కరివేపాకు (Curries), ఒక స్పూన్ ఆవాలు (Mustard), ఒక స్పూన్   మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పు (Chana dal), కొత్తిమీర (Coriyander), నూనె (Oil). 
 

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఓట్స్ (Oats) ను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో బొంబాయి రవ్వను (Bombai ravva) వేసి వేయించుకోవాలి. ఈ రెండు చల్లారాక మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి.
 

ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో (Bowl) తీసుకుని అందులో తరిగిన పచ్చిమిర్చి, బియ్యప్పిండి, వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు పుల్లటి పెరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకుని (Mix well) పక్కన పెట్టుకోవాలి. 
 

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి పోపుకు సరిపడా నూనె వేసి నూనె (Oil) వేడెక్కిన తరవాత ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, తరిగిన కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపును పైన కలుపుకున్న మిశ్రమంలో (Mixture) వేసి మరోసారి బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
 

పదిహేను నిమిషాల తరువాత స్టవ్ మీద పొంగనాల పెనం పెట్టి ఈ పిండిని అందులో వేసుకుని నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా బాగా ఎర్రగా కాల్చుకున్న పొంగనాలను ఒక ప్లేటులోకి (Plate) తీసుకుని కొబ్బరి చట్నీతో (Coconut chutney) సర్వ్ చేయండి.
 

అంతే ఓట్స్ పొంగనాలు (Oats ponganalu) రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం ఎంతో సులభంగా తయారు చేసుకునే ఓట్స్ పొంగనాలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీ పిల్లలకు, కుటుంబ సభ్యులకు నచ్చుతుంది. ఇది ఒక మంచి హెల్తీ బ్రేక్ ఫాస్ట్. బరువు తగ్గాలనుకునేవారు ఈ బ్రేక్ ఫాస్ట్ ను ట్రై చేయండి.

click me!