చర్మ సౌందర్యాన్ని పెంచే ముల్తానీ మట్టి బ్యూటీ బెనిఫిట్స్.. ఏంటో తెలుసా?

First Published Dec 4, 2021, 1:31 PM IST

చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ముల్తాని మట్టి (Multani mitti) మంచి ఔషధంగా పనిచేస్తుంది. ముల్తాని మట్టిలోని సహజసిద్ధమైన పోషకాలు ఖనిజాలు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. మనం నిత్యం చర్మసౌందర్యం కోసం అనేక ఫేషియల్స్ ను ట్రై చేస్తుంటాం. అయితే ఈసారి ముల్తానీ మట్టితో ఇంట్లోనే ఫేషియల్ ను తయారు చేసుకోండి. ముల్తాని మట్టిలో అనేక బ్యూటీ  బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక సహజ సిద్ధమైన ఫేస్ ప్యాక్ అని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ముల్తానీ మట్టితో చర్మసౌందర్యానికి కలిగే బ్యూటీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..
 

ముల్తానీ మట్టి తో చేసుకునే ఫేస్ ప్యాక్ లు చర్మానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) లేకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఇది చర్మంలోని మలినాలను తొలగించి చర్మ సమస్యలను, మొటిమను, మచ్చలను, ముఖంపై ఏర్పడే వలయాలను, మృతకణాలను, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లను తగ్గిస్తుంది. ఇది అద్భుతమైన బ్యూటీ ప్రొడక్ట్ (Beauty product). 
 

ఇది ఒక మంచి క్లీనింగ్ ఏజెంట్ (Cleaning agent) గా ఉపయోగిస్తున్నారు. ఇది పొడి చర్మానికి తగినంత తేమను అందించి కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుంది. జిడ్డు సమస్యలను తగ్గిస్తుంది. చర్మానికి మంచి రంగును అందిస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ (Benefits) ఉన్న ముల్తానీ మట్టితో చేసుకునే ఫేస్ ప్యాక్ ల తయారీ విధానం, వాటితో కలిగే బెనిఫిట్స్ ల గురించి తెలుసుకుందాం..
 

మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది: ముల్తాని మట్టిలో (Multani mitti) రోజ్ వాటర్  (Rose water) ను కలుపుకొని ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖంపై అప్లై చేసుకొని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడంతో మొటిమలను (Pimples), మచ్చలను, మృతకణాలను (Dead cells) తగ్గిస్తుంది.
 

ఇది మంచి క్లెన్సర్ (Cleanser) గా పనిచేస్తుంది. ముల్తాన్ మట్టి లో అధికంగా మెగ్నీషియం క్లోరైడ్ (Magnesium chloride) ఉంటుంది. దీని కారణంగా మొటిమలు మొటిమల తాలూకు మచ్చలు తగ్గుతాయి. చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.  
 

జిడ్డు చర్మం: ఒక కప్పులో రెండు స్పూన్ ల ముల్తాన్ మట్టి (Multani mitti), ఒక టేబుల్ స్పూన్ పెరుగు (Curd), సగం స్పూన్ నిమ్మరసం (Lemon juice), చిటికెడు పసుపు (Turmeric) వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జిడ్డు సమస్యలు తగ్గి చర్మం అందంగా మారుతుంది. 
 

చర్మ రంగును మారుస్తుంది: అధిక సూర్యరశ్మి కారణంగా కమిలిన నల్లని చర్మానికి మంచి రంగును ఇస్తుంది. దీనికోసం ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి (Multani mitti), ఒక టేబుల్ స్పూన్ పన్నీరు (Paneer), పావు స్పూన్ గ్లిజరిన్‌ (Glycerin) కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని 10 నిముషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడంతో చర్మానికి మంచి రంగు వస్తుంది.

click me!