సెక్స్ డ్రైవ్ పెరగడం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. విటమిన్ డితో ఎన్ని రోగాల ముప్పు తగ్గుతుందో..!

First Published | Oct 9, 2023, 1:02 PM IST

ఎవరి శరీరంలో అయితే విటమిన్ డి లోపం ఉంటుందో వారికి ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, కండరాల నొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. నిజానికి సూర్యరశ్మి ద్వారా వచ్చే విటమిన్ డి మన శరీరాన్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. 

శరీరంలోని ఇతర పోషకాల మాదిరిగానే విటమిన్ డి కూడా చాలా చాలా ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ జనాభాలో 50 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. మన దేశంలో విటమిన్ డి కి కొదవేం లేకున్నా.. చాలా మంది ఈ లోపంతో బాధపడుతున్నారట. అయితే ఈ లోపం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, కండరాల నొప్పి వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు ఈ విటమిన్ డి లోపం వల్ల  తరచుగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. అలాగే మూడ్ స్వింగ్స్ సమస్య కూడా వస్తుంది. 


విటమిన్ డి లోపానికి కారణాలు

ఎక్కువ సేపు నాలుగు గోడల మధ్యే ఉండటం దీనికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. 

మీ చుట్టుపక్కల కాలుష్య స్థాయిలు పెరగడం వల్ల కూడా శరీరంలో విటమిన్ డి లోపిస్తుందట. 

సూర్యరశ్మి లేని జనసాంద్రత ఉన్న ప్రదేశాల్లో నివసించడం కూడా దీనికి ఒక కారణమే.

విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా శరీరంలో ఈ లోపం వస్తుంది. 
 

Latest Videos


విటమిన్ డి లోపాన్ని ఎలా అధిగమించాలి? 

ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ విటమిన్స్ అండ్ రీసెర్చ్ లో ఒక పరిశోధన ప్రకారం.. 18 , 65 సంవత్సరాల మధ్య వయస్సున్న వారందరూ 600 ఐయు విటమిన్ డిని  తీసుకోవాలి. శరీరంలో ఈ పోషక లోపాన్ని పోగొట్టడానికి పుట్టగొడుగులు, గుడ్లు, బలవర్థకమైన పాలు, తృణధాన్యాలు, పెరుగు, కాడ్ లివర్ ఆయిల్, నారింజ రసాన్ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

Vitamin D

విటమిన్ డి ప్రయోజనాలు

గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. ఎవరి శరీరంలో విటమిన్ డి ఉండదో వారికి అధిక రక్తపోటు, గుండె ఆగిపోవడం, స్ట్రోక్ ప్రమాదాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే డాక్టర్ సలహాతో విటమిన్ డి సప్లిమెంట్స్ లేదా ఆహారాలను మీ దినచర్యలో చేర్చుకోవాలి. శరీరంలో విటమిన్ డి లోపాన్ని సహజ పద్ధతిలో పోగొట్టాలంటే రోజూ మార్నింగ్ వాక్ చేయండి. ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
 

ఎముకలు బలోపేతం 

విటమిన్ డి మన ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. నిజానికి విటమిన్ డి తోనే కాల్షియం స్రవిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అన్ని వయసుల వారిలో ఎముకల నొప్పి, ఇతర ఎముకల సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
 

బరువు తగ్గడానికి 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. ఊబకాయుల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది. ఒక సర్వే ప్రకారం.. భోజనంలో కాల్షియం, విటమిన్ డి ని చేర్చే వ్యక్తులు తరచూ ఆకలి అయ్యే సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. 

sex drive

సెక్స్ డ్రైవ్ 

విటమిన్ డి సప్లిమెంట్స్ లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. దీనివల్ల లిబిడో పెరుగుతుంది. అలాగే చిరాకు, మూడ్ స్వింగ్స్ సమస్యలు కూడా దూరమవుతాయి. ఎన్స్బిఐ ప్రకారం.. విటమిన్ డి పురుషులలో అంగస్తంభన సమస్యను తొలగిస్తుంది. అలాగే మహిళలు పిసిఒఎస్ నుంచి ఉపశమనం పొందుతారు.

click me!