తరచుగా మూత్రం, మూత్రంలో రక్తం.. మగవాళ్లు దీన్ని లైట్ తీసుకున్నారో..!

First Published Jun 10, 2023, 7:15 AM IST

పురుషులకు తరచుగా మూత్రం రావడం, మూత్రంలో రక్తం పడటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ప్రోస్టేట్ గ్రంధికి సంబంధించింది. నిపుణుల ప్రకారం.. ఇవి ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు.
 

పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో ప్రొస్టేట్ గ్రంథి ప్రధాన అవయవం. ఇది మూత్రాశయం అడుగున, పురీషనాళం ముందు ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథి ప్రధాన విధి సెమినల్ ద్రవాన్ని ఉత్పత్తి చేయడం. అలాగే వీర్యం సరైన పనితీరుకు సహాయపడటం.

prostate cancer

అయితే ప్రస్తుతం చాలా మంది ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. పురుషులను ప్రభావితం చేసే క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఒకటిగా మారింది. వృద్ధులకే కాదు, యువకులకు కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పురుషులు ఈ క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నిపుణుల ప్రకారం.. వయస్సుతో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

అయితే ఈ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా చికిత్స చేయొచ్చు. కానీ ప్రారంభ దశలో కొన్నిసార్లు ప్రొస్టేట్ క్యాన్సర్ ఎలాంటి లక్షణాలను చూపించదు. తరచుగా మూత్రవిసర్జన, మూత్ర విసర్జన చేసేటప్పుడు వచ్చే సమస్యలు, మూత్ర విసర్జనలో నొప్పి, అసౌకర్యం, మూత్రం లేదా వీర్యంలో రక్తం, పురీషనాళంలో ఒత్తిడి, తుంటి, కటి లేదా మల ప్రాంతంలో నొప్పి ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు. వెన్నెముక, ఎముకలలో నొప్పి, ఎముక పగుళ్లు , బలహీనమైన మూత్రపిండాలు కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలే. అలాగే అలసట, బరువు తగ్గడం కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలే కావొచ్చంటున్నారు నిపుణులు.

prostate cancer

ప్రోస్టేట్ క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ పురుషులు మూత్రాన్ని ఆపుకోలేరు. అలాగే మూత్రవిసర్జనలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లడం, అంటువ్యాధులు వస్తాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాప్తి లక్షణాలలో ఒకటి కాలులో మంట. క్యాన్సర్ శోషరస కణుపులకు వ్యాపిస్తే కాళ్లలో విపరీతమైన మంట వస్తుంది. 

అయితే ఈ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే వ్యాధిని తిప్పికొట్టొచ్చు. కానీ దీనిపై అవగాహన లేకపోవడం వల్ల ఇది ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. ఎందుకంటే ఇది చాలా లేట్ గా నిర్దారణ అవుతుంది. కొన్ని రకాల ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటి లక్షణాలను చూపించదు. ప్రోస్టేట్ క్యాన్సర్ మొదట్లో ఎలాంటి లక్షణాలను చూపించకపోవచ్చంటున్నారు నిపుణులు.ఎందుకంటే అవి గ్రంథి బయటి భాగంలో ఉంటాయి. 

click me!