దంతాల ఆరోగ్యంగా ఉండాలా..? ఇవి తింటే చాలు..!

First Published Jan 15, 2024, 1:27 PM IST

గతంలో దంతాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, దంతాల సమస్యలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. ఆస్పత్రికి వెళితే వేలకు వేల రూపాయలు వదిలిపోతాయి. ఈ భయంతోనే.. ముందు నుంచే దంతాల విషయంలో జాగ్రత్తలు  తీసుకోవడం మొదలుపెడుతున్నారు. 

foods for teeth


 ఈ రోజుల్లో దంతాల విషయంలోనూ చాలా జాగ్రత్తలుు తీసుకోవాలి. గతంలో దంతాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, దంతాల సమస్యలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. ఆస్పత్రికి వెళితే వేలకు వేల రూపాయలు వదిలిపోతాయి. ఈ భయంతోనే.. ముందు నుంచే దంతాల విషయంలో జాగ్రత్తలు  తీసుకోవడం మొదలుపెడుతున్నారు. 

yellow teeth

పసుపు దంతాలు మీ విశ్వాసాన్ని నాశనం చేయడమే కాకుండా అనేక నోటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. వృద్ధాప్యం, టీ , కాఫీ వినియోగం, ధూమపానం , పళ్ళు తోముకోకపోవడం వంటి అనేక కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. వివిధ రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా.. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని ఆహారాలు కచ్చితంగా తినాలట. మరి.. ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..

Latest Videos


1.ఆకుకూరలు..
ఆకు కూరలు ఆరోగ్యానికి మాత్రమే, దంతాల ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. ముఖ్యంగా పాలకూర, లెట్యూస వంటి వాటిలో  ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. విటమిన్ బి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి గమ్ ఆరోగ్యానికి సహాయపడతాయి. క్యారెట్ కూడ గమ్ ఆరోగ్యానికి సహాయపడతాయి.


2.యాపిల్, స్ట్రాబెర్రీలు..
యాపిల్ రోజూ ఒకటి తింటే.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెబుతూ ఉంటారు. కానీ.. అదే యాపిల్ మనకు దంతాలకు అనేక సమస్యలు రాకుండా ఉండటానికి కూడా సహాయం చేస్తాయి. యాపిల్స్ ఉండే వాటర్,  ఫైబర్  సాల్వియా ఏర్పడాటానికి సహాయపడతాయి. అంతేకాకుండా స్ట్రాబెర్రీలు, జామకాయ, ఉసిరి కాయలు కూడా .. దంతాల ఆరోగ్యానికి, చాలా రకాల దంత సమస్యలు రాకుండా కాపడతాయి.

3.నట్స్..
పిస్తా, బాదం,  వాల్ నట్స్, జీడి పప్పు లలో మైక్రో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. బాదం పప్పులో ఉండే అమీనో యాసిడ్స్..గమ్ డిసీజ్ లు రావడంతో పాటు.. దంతాలను బలంగా చేయడానికి సహాయపడతాయి.
 

4.సీఫుడ్..

సీఫుడ్ ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇందులో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే.. ఇవే దంతాల ఆరోగ్యంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. గమ్ ఇన్ ఫ్లమేషన్ కి , ఏధైనా గాయం అయినా త్వరగా తగ్గిపోవడానికి సహాయడతాయి.
 

green tea

5.గ్రీన్ టీ..
గ్రీన్ టీలో న్యూటియంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు..పోలీఫెనాల్స్ దంతాల సమస్యను తగ్గించడానికి సహాయం చేస్తాయి. కాబట్టి.. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల.. దంతాలు బలంగా మారతాయి. వీటితో పాటు పాలు, చీజ్ కూడా.. దంతాలను బలంగా  మార్చడంలో సహాయపడతాయి.

click me!