ఒత్తిడి, హైపోథైరాయిడిజం కి విడదీయ రాని బంధం ఉంది. ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. థైరాయిడ్ కి శాశ్వత పరిష్కారం లేదని... జీవితాంతం ట్యాబ్లెట్స్ మింగుతూ ఉండాల్సిందేనని అనుకుంటూ ఉంటారు. తప్పక వాటిని మింగుతూ ఉంటారు. కానీ.. మనం మనకు ఉన్న థైరాయిడ్ సమస్యను యోగాతో పరిష్కరంచవచ్చు.
యోగా కేవలం బరువు తగ్గించడానికి మాత్రమే పనికొస్తుందని అందరూ అనుకుంటారు. కానీ.. ఈ యోగా థైరాయిడ్ సమస్యను పూర్తిగా నయం చేస్తుంది. అయితే... ఎలాంటి ఆసనాలు చేస్తే.. థైరాయిడ్ సమస్య పరిష్కారం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
1.cat and Cow Position: క్యాట్ అండ్ కౌ పొజిషన్ తో యోగాని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఈ యోగాసనంలో థైరాయిడ్ గ్రంథులను యాక్టివ్ చేస్తాయి. ఈ యోగాసనంలో మనం మన మెడ, గడ్డం, చెస్ట్ బాగాన్ని ఎక్కువగా ముందుకూ, వెనక్కి కదిలిస్తూ ఉంటాం. దాని వల్ల రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. ఫలితంగా థైరాయిడ్ కంట్రోల్ లో ఉంటుంది.
2.legs up the wall position:ఈ యోగసనాన్ని విపరీత కారణి అని కూడా పిలుస్తారు. నేలమీద పడుకోని.. కాళ్లను నిటారుగా.. గోడకు అదిమిపెట్టి ఉంచాలి. ఈ పొజిషన్ కూడా థైరాయిడ్ సమస్యను సులభంగా తగ్గిస్తుంది. చాలా మందికి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది.
3.Supported shoulder stand: ఈ యోగాసనాన్ని సాలంబ సర్వాంగసనం అని కూడా పిలుస్తారు. ఈ యోగాసనం చేయడానికి మనం మన కాళ్లను రెండు చేతులతో.. పైకి ఎత్తాల్సి ఉంటుంది. ఇది కూడా థైరాయిడ్ సమస్యను తగ్గించడంలో కీలకంగా పని చేస్తుంది.
4.Cobr pose:కోబ్రా పోజ్ ని భుజంగాసన అని కూడా పిలుస్తారు. దీనిని చేయడానికి బోర్లా పడుకుంటాం. తర్వాత.. చేతులను మ్యాట్ పై అదిమి పెట్టి.. నడుము పైభాగాన్ని పైకి లేపాల్సి ఉంటుంది. ఈ యోగాసనాన్ని రెగ్యులర్ గా చేస్తూ ఉండటం వల్ల కూడా మీ థైరాయిడ్ సమస్యను తగ్గించుకోగలరు.