కూల్ వాటర్ ఎక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published Apr 20, 2024, 9:50 AM IST

మండే ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ చల్ల చల్లని నీళ్లను తాగుతుంటారు. ఇది చాలా కామన్. కానీ చల్ల నీళ్లను ఎక్కువగా తాగితే మాత్రం మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే? 
 

ఎండాకాలంలో వేడివేడిగా అస్సలు తినాలనిపించదు. తాగాలనిపించదు. ఏదున్నా చల్లగానే తాగాలనిపిస్తుంది. వేసవి తాపం అంత తొందరగా తీరదు మరి. అందుకే ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ చల్ల నీళ్లనే తాగుతుంటారు. ఎండనుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్ లోంచి బాటిల్ తీసి తాగడం చాలా మందికి అలవాటు. చల్లనీళ్లు తాగడం వల్ల బాడీ కూల్ గా అనిపిస్తుంది. వేడి తగ్గుతుంది. కానీ ఇది కొంతసేపటి వరకు మాత్రమే. అవును చల్లనీళ్లను తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

ఐస్ లేదా చల్ల నీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయన్న ముచ్చట చాలా తక్కువ మందికే తెలుసు. చల్లనీరు మీ బరువును పెంచడమే కాకుండా, మీ గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అసలు చల్లనీటిని తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

జీర్ణ సమస్యలు

చల్లటి నీరు మన జీర్ణవ్యవస్థను చాలా ఫాస్ట్ గా ప్రభావితం చేస్తుంది. రెగ్యులర్ గా కూల్ వాటర్ ను తాగితే ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. అలాగే కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, అపానవాయువు వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే కూల్ వాటర్ ను తాగినప్పుడు అది మన శరీర ఉష్ణోగ్రతతో సరిపోలదు. అలాగే కడుపులో ఉన్న ఆహారాన్ని శరీరానికి చేరడం ద్వారా జీర్ణించుకోవడం కష్టమవుతుంది.
 

తలనొప్పి, సైనస్

కూల్ వాటర్ ను తరచుగా తాగితే  'బ్రెయిన్ ఫ్రీజ్' సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు ఐస్ వాటర్ లేదా ఎక్కువ ఐస్ క్రీం తినడం వల్ల కూడా ఇది వస్తుంది. నిజానికి చల్ల నీరు వెన్నెముక సున్నితమైన నరాలను చల్లబరుస్తుంది. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. దీనివల్ల తలనొప్పి, సైనస్ సమస్యలు వస్తాయి.
 

నెమ్మదిగా హార్ట్ బీట్

మెడ ద్వారా గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థను నియంత్రించే వాగస్ నాడి మన శరీరంలో ఉంటుంది. మీరు ఎక్కువ కూల్ వాటర్ ను తాగితే మీ సిరలు ఫాస్ట్ గా చల్లబడతాయి. అలాగే హృదయ స్పందన రేటు, పల్స్ రేటు నెమ్మదిస్తుంది. 
 

బరువు పెరగడం

బరువు తగ్గాలనుకుంటే చల్ల నీటిని మాత్రం తాగకండి. ఎందుకంటే చల్ల నీరు తాగడం వల్ల మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు గట్టిపడుతుంది. ఇది కొవ్వును కరిగించడం కష్టతరం చేస్తుంది. అందుకే మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే చల్లని నీటికి దూరంగా ఉండండి.
 

గొంతు ఇన్ఫెక్షన్ 

కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తిన్న తర్వాత చల్లనీళ్లను తాగితే  అదనపు శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఇది శ్వాసనాళంలో పేరుకుపోతుంది. అలాగే తాపజనక ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు చల్ల నీటిని తాగడం మానుకోండి.
 

click me!