తిన్న తర్వాత బ్లడ్ షుగర్ పెరగొద్దంటే ఇలా చేయండి

First Published | Dec 1, 2023, 1:48 PM IST

Diabetes: డయాబెటీస్ పేషంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు తిన్న తర్వాత బాగా పెరిగిపోతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో కొన్ని పనులు చేస్తే బ్లడ్ షుగర్ మళ్లీ నార్మల్ అవుతుంది. 
 

diabetes

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యాధి చిన్నదే అని లైట్ తీసుకుంటే పొరపాటే. ఎందుకంటే డయాబెటీస్ ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే మధుమేహులు ఎప్పుడూ కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడాలి. అయితే చాలా మంది డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు భోజనం చేసిన తర్వాత బాగా పెరిగిపోతుంటాయి. కార్బోహైడ్రేట్లే రక్తంలో చక్కెరగా మారుతాయి. అలాగే మీరు కార్బోహైడ్రేట్లను తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. రక్తంలో చక్కెర పెరగడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 

మీ రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలికంగా ఎక్కువగా ఉంటే.. మీకు డయాబెటిస్ తో సంబంధం ఉన్న ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరి భోజనం చేసిన తర్వాత రక్తంలో చెక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేందుకు ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 


నడక

తిన్న తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే మీరు శారీరకంగా చురుకుగా ఉండాలి. అంటే తిన్న తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు నడవడం లేదా మెట్లు ఎక్కడం వంటివి చేయండి. ఇవి మీ శరీరం కార్బోహైడ్రేట్లను వేగంగా గ్రహించడాన్ని నివారించడానికి అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
 

పానీయాలు

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కొన్ని రకాల పానీయాలు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు తిన్న తర్వాత ఒక గ్లాసు దాల్చిన చెక్క లేదా మెంతి నీటిని తాగడం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు ఈ పానీయాలు జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. అలాగే  ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఈ పానీయాలు మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడతాయి.

diabetes

పెరుగు

ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే మీరు తినే ఆహారంలో పెరుగును చేర్చండి. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది.  పెరుగులోని ప్రోటీన్, కొవ్వు కార్బోహైడ్రేట్ల శోషణను మందగించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

Latest Videos

click me!