ఆ చెత్త అలవాటు ఉన్నవారికి కరోనా సోకడం అరుదట.. తాజా సర్వే..!

First Published Jan 19, 2021, 2:35 PM IST

గతంలో ఓ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా సోకే అవకాశం తక్కువ అని చెప్పారు. ఇప్పుడు.. వీరికి కూడా ఈ మహమ్మారి కొంత వరకు దూరంగా ఉంటుందని తేలింది.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ వైరస్ తీవ్రత కాస్త తగ్గినప్పటికీ.. కేసులు మాత్రం నమోదౌతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కరోనా కేసులు నమోదౌతున్నాయి. తాజాగా.. స్ట్రైయిన్ అంటూ కొత్త రకం కరోనా కూడా ప్రజలను భయపెడుతోంది.
undefined
ఈ నేపథ్యంలో.. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) సంస్థ తాజాగా ఓ పరిశోధన చేసింది. కరోనా వైరస్ పై జరిపిన ఆ పరిశోధనలో షాకింగ్ విషయాలు తెలిసాయి.
undefined
వారు చెప్పిన వివరాల ప్రకారం.. ప్యూర్ వెజిటేరియన్స్, పొగతాగేవారికి కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయట. గతంలో ఓ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా సోకే అవకాశం తక్కువ అని చెప్పారు. ఇప్పుడు.. వీరికి కూడా ఈ మహమ్మారి కొంత వరకు దూరంగా ఉంటుందని తేలింది.
undefined
అచ్చంగా కూరగాయలు తినేవారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఈ కరోనా సోకే అవకాశం వారిలో చాలా తక్కువగా ఉంటుందని వారి సర్వేలో తేలింది. దాదాపు 10,427 మంది పై చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. వారిలో అంతకముందే యాంటీ బాడీస్ ఉన్నట్లు గుర్తించారు.
undefined
గతంలో ఓ సంస్థ జరిపిన సర్వేలో పొగతాగే వారిలో నావెల్‌ కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. పొగ తాగనివారి కన్నా పొగ తాగేవారి ఊపిరితిత్తుల్లో ఈ వైరస్‌ ప్రవేశించే ముప్పు ఎక్కువని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
undefined
పొగతాగిన వారి, తాగని వారి ఊపిరితిత్తుల కణజాలాల్లో ఉన్న రైబోన్యూక్లిక్‌ యాసిడ్‌ (ఆర్‌ఎన్‌ఏ) డేటాను పరిశోధకులు విశ్లేషించారు. శ్వాస మార్గంలోని వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ఏసీఈ2, ఫ్యూరిన్‌, టీఎంపీఆర్‌ఎ్‌సఎస్‌2 కణజాలాలను వారు పరిశీలించారు.
undefined
అస్సలు పొగతాగని వారితో పోలిస్తే కనీసం 100 సిగరెట్లు తాగిన వారి ఊపిరితిత్తుల కణజాలాలు వైరస్‌ బారినపడే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని కనుగొన్నారు.
undefined
అయితే.. సీఎస్ఐఆర్ చేసిన సర్వేలో మాత్రం.. స్మోకింగ్ చేసే వారిలో కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువగా ఉందని తేలింది. కొంత మంది యువకులపై దాదాపు ఆరు నెలలపాటు చేసిన పరిశోధనలో ఈ విషయం నిరూపితమైందని వారు చెప్పారు.
undefined
click me!