ఇలా నిద్రపోయినా బరువు తగ్గొచ్చు తెలుసా..?

First Published Jul 6, 2021, 10:00 AM IST

బరువు తగ్గించడంలోనూ నిద్ర కీలక పాత్ర పోషిస్తుందట. మనిషి సరిపడా నిద్రపోయినప్పుడు.. వారు ఆరోగ్యవంతమైన బరువు కలిగి ఉంటారట.

మనిషికి తిండి ఎంత అవసరమో. నిద్ర కూడా అంతే అవసరం. ఈ విషయం మనందరికీ తెలుసు.. కానీ.. మనలో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఏదో ఒక కారణం వల్ల... సరిపోను నిద్రపోలేరు. దాని వల్ల అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
undefined
శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడానికి.. కణాలను పునరుత్పత్తి చేసుకోవడానికి.. మన రోగనిరోధక వ్యవస్థ పనితీరు పునరుద్దరణ లాంటివన్నీ.. మనం నిద్రపోయినప్పుడు మాత్రమే జరుగుతాయట. మనం గంటల తరపడి.. నిద్రపోకుండా.. కంటికి ఎలాంటి రెస్ట్ ఇవ్వకుండా చేయడం వల్ల ఈ పనులన్నీ జరగకుండా వెనకపడతాయి.
undefined
అంతేకాదు.. బరువు తగ్గించడంలోనూ నిద్ర కీలక పాత్ర పోషిస్తుందట. మనిషి సరిపడా నిద్రపోయినప్పుడు.. వారు ఆరోగ్యవంతమైన బరువు కలిగి ఉంటారట.
undefined
నిద్ర లేకపోవడం, లేదా పేలవమైన, అంతరాయం కలిగించే నిద్ర విధానాలు కూడా జీవక్రియ మరియు హార్మోన్లలో మార్పులకు కారణమవుతాయి,
undefined
ఇది ఆకలి ,కోరికలు పెరగడానికి ,ఇన్సులిన్ సున్నితత్వం తగ్గడానికి దారితీస్తుంది. అందువల్ల, మీరు బరువు తగ్గాలంటే మంచి నిద్ర చాలా అవసరం. మరి ఈ నిద్ర వల్ల కలిగే ఇతర లాభాలు కూడా ఇప్పుడు చూద్దాం..
undefined
మంచి రాత్రి నిద్ర శరీరం జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. సరిపడా నిద్రపోయే వారిలో.. ఈ జీవక్రియ బలంగా ఉంటుంది. నిద్రలేమితో బాధపడేవారిలో జీవక్రియ సరిగా ఉండదు. అంతేకాకుండా. .. గుండె జబ్బులు రావడానికి కారణం అవుతుంది.
undefined
మనిషి సరిపడా నిద్రపోయినప్పుడు వారిలో ఒత్తిడి లెవల్స్ తక్కువగా ఉంటాయి. ఆరోజంతా వారు ఉత్సాహంగా ఉంటారు. వారి మూడ్ చాలా బాగుంటుంది. సరిగా ఆహారం కూడా తీసుకోగలుగుతారు. అదే నిద్రలేకపోతే.. చాలా చిరాకుగా ఉంటుంది. అంతేకాకుండా.. దాని వల్ల వారు ఎక్కువగా తిని.. బరువు ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది.
undefined
సరిపడా నిద్రపోయే వారిలో మెదడు ప్రశాంతంగా ఉంటుంది. చురుకుగా పనిచేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు... సరిపడా నిద్రపోయేవారిలో... రోగ నిరోధక శక్తి కూడా మెరుగ్గా ఉంటుంది.
undefined
ఆరోగ్యకరమైన జీవనశైలిని కాపాడుకోవడానికి మీరు రోజూ 7-9 గంటల నిద్ర పొందడం చాలా ముఖ్యం. మీరు నిద్రతో మిళితం చేసే ఇతర అలవాట్లు ఉన్నాయి, ఇవి బరువును తగ్గించడంలో మీకు సహాయపడతాయి. నిద్ర నాణ్యతను పెంచే అలవాట్లను అలవాటు చేసుకోవాలి.
undefined
కెఫిన్ వినియోగాన్ని తగ్గించాలి. పడుకునే ముందు సెల్ ఫోన్ , టీవీలు చూడటం తగ్గించాలి.అధిక ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగాలి.
undefined
click me!