బరువు తగ్గడానికని లెమన్ వాటర్ ను ఎక్కువగా తాగుతున్నరా? ఈ విషయం తెలిస్తే ఆ తప్పు ఇక చెయ్యనే చేయరు

R Shivallela | Updated : Oct 21 2023, 07:15 AM IST
Google News Follow Us

నిమ్మకాయ వాటర్ ను డిటాక్స్ డ్రింక్ అంటారు. ఇది బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కానీ నిమ్మరసాన్ని ఎక్కువగా తాగితే ప్రయోజనాలకు బదులుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే దీనిలో యాసిడ్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది.. 
 

16
బరువు తగ్గడానికని లెమన్ వాటర్ ను ఎక్కువగా తాగుతున్నరా? ఈ విషయం తెలిస్తే ఆ తప్పు ఇక చెయ్యనే చేయరు

నిమ్మకాయ ఆరోగ్యానికి నిధి. దీనిలో ఉండే ఔషద గుణాలు మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి. మరెన్నో అనారోగ్య సమస్యలను తొందరగా తగ్గిస్తాయి. చాలా మంది బరువు తగ్గడానికని  ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగుతుంటారు. ఈ లెమన్ వాటర్ శరీరంలో నీటి లోపాన్ని కూడా తొలగిస్తుంది. నిమ్మకాయలో విటమిన్-సి, విటమిన్ బి6, విటమిన్ ఎ, విటమిన్-ఇ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే నిమ్మరసం మన ఆరోగ్యానికి మేలు చేసినా.. దీన్ని అతిగా తాగితే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటంటే? 

26

శరీరంలో నీటి కొరత

నిమ్మరసం మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తుందన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ దీన్ని రెగ్యులర్ గా అవసరమైన దానికంటే ఎక్కువగా తాగితే ఇది మీ శరీరంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. అవును నిమ్మరసాన్ని ఎక్కువగా తాగితే తరచూ మూత్రం వస్తుంది. దీంతో మీ శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. 
 

36

జీర్ణ సమస్యలు

నిమ్మరసాన్ని  తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ కొంతమంది ఈ పానీయాన్ని తాగకూడదు. నిజానికి నిమ్మరసాన్ని ఎక్కువగా తాగడం వల్ల వికారం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. 
 

Related Articles

46

గుండెల్లో మంట

మీరు అవసరమైన దానికంటే నిమ్మరసాన్ని ఎక్కువగా తాగితే గనుక గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీకు ఇప్పటికే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉంటే నిమ్మరసాన్ని మొత్తమే తాగకపోవడమే బెటర్. 
 

56

దంతాలకు హానికరం

నిమ్మరసాన్ని ఎక్కువగా తాగిగే దంతాల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇది ఎన్నో దంత సమస్యలను కలిగిస్తుంది. నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల  ఇది దంతాలను దెబ్బతీస్తుంది.
 

66

lemon water

చర్మపు చికాకు

చర్మ సంరక్షణలో భాగంగా నిమ్మకాయను చేర్చడం మంచిదంటుంటారు చాలా మంది. కానీ నిమ్మకాయను నేరుగా చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మ చికాకు కలుగుతుంది. అందుకే దీన్ని చర్మానికి నేరుగా అప్లై చేయకుండా ముందు నిమ్మరసంలో నీళ్లు కలిపి చర్మానికి అప్లై చేయండి. ఆ తర్వాత ఎండలోకి వెళ్లడం మానుకోండి.

Read more Photos on
Recommended Photos