రక్తంలో చక్కెర స్థాయిలు శరీరంలో ఉన్న గ్లూకోస్ ని సూచిస్తాయి. ఇది మీరు తినే ఆహారం నుండి వస్తుంది. శరీర కణాలకు గ్లూకోజ్ శక్తి ప్రధాన వనరు. కాబట్టి మీ రక్తం లో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటం చాలా అవసరం.
99mg/dl లేదా అంతకంటే తక్కువ రక్తం లో చక్కెర స్థాయి సాధారణం.100 నుంచి125mg/dl ఉంటే ఫ్రీ డయాబెటిస్ లో ఉన్నట్టు. 126mg/dl అంతకంటే ఎక్కువ ఉంటే మీకు షుగర్ వ్యాధి ఉన్నట్లు సూచిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు..
దృష్టి నష్టం, మూత్రపిండాల వ్యాధి వంటి తీవ్ర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అయితే కరివేపాకుని ఆహారంగా చేసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది అని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. కరివేపాకులో విటమిన్లు, బీటా, కెరోటిన్ మరియు కార్బజోల్, ఆల్కలాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి ఆక్సీకరణ నష్టంతో సంబంధం ఉన్న అనేక వ్యాధులను నివారిస్తాయి. ఆ జాబితాలో టైప్ టు మధుమేహం అగ్రస్థానంలో ఉంది. ఉదయం 8 నుంచి 10 తాజా కరివేపాకులను నమలవచ్చు లేదా కరివేపాకు రసం తయారు చేసి ప్రతిరోజు ఉదయం త్రాగవచ్చు.
వాటి ప్రయోజనాలను పూర్తిగా పొందేందుకు వాటిని కూరలు, అన్నం వంటకాలు మరియు సలాడ్లకు జోడించండి. మధుమేహం ఉన్నవారిలో స్టార్చ్ 2 గ్లూకోజ్ విచ్చిన్నం రేటును తగ్గించే సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. అందువలన ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది.
కాబట్టి ఆహారంలో కరివేపాకులను ఎక్కువగా చేర్చుకోవాలి. కరివేపాకు మీ ఇన్సూరెన్స్ చర్యను పెంచుతుంది. అలాగే శరీరం ఇన్సులిన్ ను సరిగా ఉపయోగించినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.