పాలు ఎక్కువగా తాగితే ఏమౌతుంది..?

First Published | Jun 3, 2024, 4:30 PM IST

కడుపులో విపరీతమైన నొప్పి లాంటివది వస్తూ ఉంటాయట. అందుకే.. పాల అలర్జీ ఉన్నా లేకున్నా... అతిగా పాలు తీసుకునే అలవాటు ఉన్నా వెంటనే ఆపేయాలి.


ఉదయం లేవగానే పెద్దలు ఇంట్లో టీ, కాఫీ తాగినట్లు పిల్లలు పాలు తాగుతారు. ఎందుకంటే.. పిల్లల ఎదుగుదలలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. పాలు ఆరోగ్యానికి చాలా మంచివి, అంత మంచి చేసే ఈ పాలు మరీ ఎక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
 

పాలు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయట. పాలల్లో ఉండే లాక్టోస్ దానికి కారణం అవుతుందట. ముఖ్యంగా డయేరియా, గ్యాస్, బ్లోటింగ్ , కడుపులో విపరీతమైన నొప్పి లాంటివది వస్తూ ఉంటాయట. అందుకే.. పాల అలర్జీ ఉన్నా లేకున్నా... అతిగా పాలు తీసుకునే అలవాటు ఉన్నా వెంటనే ఆపేయాలి.


కొందరిలో ముఖ్యంగా స్త్రీలలో పాలు ఎక్కువగా తాగడం వల్ల...మొటిమల సమస్య ఏర్పడుతుందట. పాలల్లో ఉండే హార్మోన్లు ముఖంపై ఆయిల్ గ్లాండ్స, మొటిమల సమస్య ఏర్పడటానికి కారణం అవుతాయట.
 

కొందరిలో అయితే..,. కిడ్నీల్లో రాళ్ల సమస్యగా కూడా మారే అవకాశం ఉందట.  పాలు విపరీతంగా తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్ల మాదిరిగా కూడా ఏర్పడనున్నాయట. పాలల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం మనకు ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడతాయి. కానీ ఎక్కువ పాలు తాగడం వల్ల అదనపు కాల్షియం.. కిడ్నీల్లోరాళ్లలా మారే ప్రమాదం ఉందట.

ఇక పాలల్లో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా పాలు తాగడం వల్ల క్యాలరీ ఇన్ టేక్ ఎక్కువ గా మారి.. అతిగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇది మాత్రమే కాదు.. మరీ ఎక్కువగా పాలు తాగితే... గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి.. మరీ అతిగా తాగకుండా ఉండటమే మంచిది.

Latest Videos

click me!