ఏది తిన్నా.. అరగడం లేదా..? ఇదిగో పరిష్కారం..!

First Published | Jun 3, 2024, 1:38 PM IST

ఈ జీర్ణాశయ సమస్యలను తగ్గించుకోవడానికి మనం కొన్ని ఫుడ్స్ ని డైట్్ లో భాగం చేసుకుంటే సరిపోతుంది.
 

Digestive aid

చాలా మందికి  అజీర్ణ సమస్యలు ఉంటాయి. ఏదో ఒక ఫుడ్ తినడం వల్ల , అది పడక చాలా మందికి అరుగుదల సమస్య ఏర్పడుతుంది. కానీ.. కొందరికి ఎన్ని తిన్నా.. కొంచెం తిన్నా కూడా పొట్టు హెవీ అయిన ఫీలింగ్ కలుగుతుంది. పేరు ఆరోగ్యం సరిగా లేనప్పుడు  ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. అందుకే.. జీర్ణాశయ ఆరోగ్యానికి ఆహారంపై చాలా శ్రద్ధ అవసరం. ఈ జీర్ణాశయ సమస్యలను తగ్గించుకోవడానికి మనం కొన్ని ఫుడ్స్ ని డైట్్ లో భాగం చేసుకుంటే సరిపోతుంది.

1. అల్లం


జీర్ణ సమస్యలకు అల్లం ఒక అద్భుతమైన ఔషధం. అల్లంలో ఉండే జింజెరాల్ దీనికి సహకరిస్తుంది. తీసుకున్న ఆహారం  సులంగా జీర్ణమయ్యేలా సహాయపడుతుంది.

Latest Videos


2. మజ్జిగ

మజ్జిగలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మజ్జిగ తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కడుపు హాయిగా ఉంటుంది.

3. పెరుగు

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ మీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపు నొప్పిని తగ్గిస్తుంది. మీ గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ghee

4. నెయ్యి

నెయ్యి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇవి కండరాల ఆరోగ్యానికి , రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి. తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమౌతుంది.

5. ఉల్లిపాయలు

ఉల్లిపాయలు మన శరీరానికి అవసరమైన బ్యాక్టీరియాను కాపాడతాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేయడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి ఉల్లిపాయను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.

click me!