రోజుకు ఎంత ఉప్పు తినాలి? ఇంతకు మించి తిన్నారంటే మీ ప్రాణాలకు ముప్పే..

First Published Jan 17, 2024, 3:45 PM IST

ఉప్పు లేకుండా వంటలను తినడం చాలా కష్టమే. కానీ ఉప్పును మోతాదుకు మించి తింటే మాత్రం ప్రాణాలకు ముప్పే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఉప్పును ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం 1.89 మిలియన్ల మంది మరణిస్తున్నారు.

ఉప్పు లేకుండా కూరలను తింటామా? ఛాన్సే లేదు కదా.. నిజానికి ఉప్పుతోనే  వంటలకు మంచి టేస్ట్ వస్తుంది. కానీ ఉప్పును మోతాదులోనే తీసుకోవాలి. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయి. ఇవి మన ప్రాణాలను సులువుగా తీసేయగలవు. 
 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం..ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల  ప్రతి సంవత్సరం 1.89 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఇది అధిక రక్తపోటు, గుండె సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఉప్పు, ఆరోగ్య సమస్యల మధ్య సంబంధాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


ఉప్పులో ఉండే సోడియం కణాల సాధారణ పనితీరును నిర్వహించడానికి సహాయపడే ముఖ్యమైన పోషకం. ఇది పాడి, మాంసం వంటి వివిధ ఆహారాలలో సహజంగా ఉంటుంది. కానీ సోడియాన్ని ఎక్కువగా తీసుకోవడం గుండె జబ్బులు, స్ట్రోక్, అకాల మరణం ప్రమాదం పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెళ్లడిస్తోంది. 

Excess Salt

హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుంచి వచ్చిన ఒక నివేదిక.. సోడియాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుందని సూచిస్తుంది. ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. ముఖ్యంగా ఇప్పటికీ మీకు గుండె సమస్యలు ఉంటే ఉప్పు మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది.
 


రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలి?

పెద్దలు రోజుకు 2000 మి.గ్రా ఉప్పును తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. అంటే 2 గ్రాములు అన్న మాట. అంటే ఇది ఒక టీస్పూన్ తక్కువగా ఉంటుంది. అయితే పిల్లలకు, వారి శక్తి అవసరాలకు అనుగుణంగా మోతాదును సర్దుబాటు చేయొచ్చు. ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి అయోడిన్ ఉప్పు అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది.
 

ఉప్పును తీసుకోవడాన్ని ఎలా తగ్గించాలి?

ఉప్పు ఆహార రుచిని పెంచుతుంది. అందుకే దీనిని తగ్గించడం కష్టంగా ఉంటుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలని  సిఫార్సు చేస్తోంది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలి. వఅలాగే మీ రోజు వారి ఆహారంలో మీరు వేసే ఉప్పు మొత్తాన్ని తెలుసుకోవాలి. వంట చేసేటప్పుడు ఉప్పును తక్కువగా వేయాలి. 

click me!