పైల్స్ మాత్రమే కాదు.. టాయిలెట్ లో మొబైల్ యూజ్ చేస్తే ఈ ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తయ్..

Published : Aug 20, 2023, 09:42 AM IST

టాయిలెట్ లో మొబైల్ ఫోన్ లను ఉపయోగించే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ దీనివల్ల టాయిలెట్ లో ఉండే హానికరమైన వైరస్ లు, బ్యాక్టీరియా మీ ఫోన్ కు అంటుకుంటాయి. ఆ తర్వాత అవి మిమ్మల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తాయి.   

PREV
110
 పైల్స్ మాత్రమే కాదు.. టాయిలెట్ లో మొబైల్ యూజ్ చేస్తే ఈ ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తయ్..

టాయిలెట్ లో ఎక్కువ సేపు కూర్చొని ఫోన్ లో అవి ఇవి చూడటం కొత్త ట్రెండ్ గా మారింది. కానీ ఈ అలవాటు మీ శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా అస్సలు మంచిది కాదు. టాయిలెట్ లో ఎక్కువ సేపు ఫోన్ ను వాడే అలవాటున్న వారికి ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

210

టాయిలెట్ లో మొబైల్ ఫోన్లు వాడటం హాబీగా కాకుండా సమస్యగా మారింది. చికాగోకు చెందిన మీడియా సంస్థ పీఆర్ న్యూస్ వైర్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. టాయిలెట్ లో మొబైల్ ఫోన్లను ఉపయోగించడం వల్ల పరిశుభ్రత తగ్గుతుంది. అలాగే ఎన్నో రకాల హానికరమైన వైరస్ లు, బ్యాక్టీరియా మీ ఫోన్ కు అంటుకుంటాయి. ఆ తర్వాత అవి మిమ్మల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తాయి. 
 

310

గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..

ఆస్ట్రేలియాలో 2016 లో జరిపిన ఒక అధ్యయనంలో.. ఆస్ట్రేలియా జనాభాలో 41 శాతం మంది టాయిలెట్ కు ఫోన్లను తీసుకువెళుతున్నారని కనుగొన్నారు. అలాగే టాయిలెట్ సీట్ కంటే.. టాయిలెట్ లో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లే వారి ఫోన్లలో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయని అమెరికాకు చెందిన వాటర్ ఫిల్టర్ గురు అనే సంస్థ ఒక నివేదికలో తెలిపింది.
 

410


టాయిలెట్ లో మొబైల్ ఫోన్లను ఉపయోగించడం వల్ల వచ్చే సమస్యలు

సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా దాడి 

టాయిలెట్ లో సాధారణంగా సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇకమీరు టాయిలెట్ లో ఫోన్ ఉపయోగించడం వల్ల అన్ని సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా మీ ఫోన్ ఉపరితలానికి అంటుకుంటాయి. దీని వల్ల మీ ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది.
 

510

సరైన పరిశుభ్రత అవసరం

మరుగుదొడ్డిని ఖచ్చితంగా చాలా శుభ్రంగా ఉంచాలి. మీరు టాయిలెట్ లో ఫోన్ ఉపయోగించినప్పుడు బ్యాక్టీరియా, క్రిములు మీ ఫోన్ కు అంటుకుంటాయి. కానీ ఫోన్ ను క్లీన్ చేసే అలవాటు చాలా మందికి ఉండదు. ఈ సూక్ష్మక్రిములు మీకు అంటుకుని ఎన్నో రోగాల బారిన పడేస్తాయి. కాబట్టి మీరు ఫోన్ ను టాయిలెట్ కు తీసుకెళ్లినప్పుడల్లా సరిగ్గా శుభ్రం చేయండి.
 

610

మానసిక ఆరోగ్యం

టాయిలెట్ లోకి  మొబైల్ ఫోన్ ను తీసుకెళ్లడం వల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. ఎందుకంటే మనం రోజంతా మన ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతాం. అయితే టాయిలెట్ లో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కానీ అక్కడకు కూడా ఫోన్లను తీసుకెళ్లడం  మొదలు పెట్టడంతో ఒకరకంగా రోజంతా ఫోన్ వాడుతూ ఉన్నట్టే. ఇది మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
 

710

టాయిలెట్ లో ఫోన్ ఉపయోగించడం వల్ల వచ్చే వ్యాధులు

టాయిలెట్ లో ఫోన్ ఉపయోగించడం వల్ల మీ అలవాట్లు మారిపోవడమే కాకుండా ఎన్నో రకాల వ్యాధులొస్తాయి. సాధారణంగా ఏ వ్యక్తి అయినా ఫ్రెష్ అవ్వడానికి 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది. కానీ మనం ఫోన్ ను తీసుకెళ్లినప్పుడు దాన్ని స్క్రోల్ చేయడంలో బిజీ అయిపోయి 20 నుంచి 25 నిమిషాలు కూర్చుంటాం. ఇలా చేయడం వల్ల ఎన్నో రోగాల బారిన పడతాం.
 

810

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ 

ఎక్కువ సేపు టాయిలెట్ లో కూర్చొని ఫోన్ రన్ చేయడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ద్వారా మీ చేతులకు బ్యాక్టీరియా అంటుకుంటుంది. మీరు మీ కళ్లు, ముక్కు, నోటిని ముట్టుకున్నప్పుడు ఇది మీ శరీరంలోకి వెళుతుంది. ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది.
 

910

స్కిన్ ఇన్ఫెక్షన్స్ 

ఫోన్ చూడటం, టాయిలెట్ మురికి వాతావరణంలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మన చర్మం ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ఇది చర్మ సమస్యలను కలిగిస్తుంది. 
 

1010

పైల్స్ ప్రమాదం పెరుగుతుంది

వాష్ రూమ్ లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పైల్స్ సమస్య రావచ్చు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల శరీరం ఎక్కువ సేపు వాష్ రూమ్ లో ఉండటానికి అలవాటు పడుతుంది. దీనితో పాటుగా ఆ ప్రాంతానికి సమీపంలోని సిరలలో వాపు ఉంటుంది. దీనిని హేమోరాయిడ్స్ అంటారు.

click me!

Recommended Stories