గుండెపోటు రాకూడదంటే ఏం చేయాలి?

First Published May 18, 2024, 11:44 AM IST

పెద్దలు, చిన్నలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గుండెజబ్బులు, గుండెపోటు బారిన పడుతున్నారు. అయితే మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం మీ గుండె పదిలంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఏం చేయాలంటే?

ప్రస్తుత కాలంలో అన్ని వయసుల వారు గుండెజబ్బుల బారిన పడుతున్నారు. గుండెజబ్బులుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. స్థూలకాయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మొదలైనవి గుండె జబ్బులకు  దారితీస్తాయి. కొన్ని కొన్ని సార్లు గుండెజబ్బుల చరిత్ర ఉన్నవారికి కూడా గుండెపోటు వస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ , గుండె జబ్బులు రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

రోజువారీ వ్యాయామం

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రెగ్యులర్ గా ఉదయం లేదా సాయంత్రం వేళ వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, యోగా వంటి ఏదైనా వ్యాయామం చేయండి. దీనివల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. 
 

Latest Videos


మంచి నిద్ర

సాధారణంగా ఒక వ్యక్తి ఒక్కరూ రాత్రిపూట 7 నుంచి 9 గంటలు కంటినిండా నిద్రపోవాలి. కానీ కొంతమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. నిద్రలేమితో బాధపడేవారు ప్రతి రాత్రి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. అప్పుడే వీళ్లు బాగా నిద్రపోతారు. రాత్రిపూట మీరు కనీసం 7 గంటల పాటైనా గాఢనిద్రపోతే మీ గుండెతో పాటుగా మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 
 

షుగర్ లెవల్స్ కంట్రోల్

డయాబెటిస్ ఉన్నవారికి గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీరికి గుండెజబ్బలు రాకూడదంటే మాత్రం శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, అలవాట్లను అనుసరించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. 
 

మానసిక ఆరోగ్యం

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మీరు ఎక్కువ ఒత్తిడికి గురైతే గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాల పాటైనా ధ్యానం చేయాలి. 
 

స్మోకింగ్ వద్దు 

చాలా మందికి గుండెపోటు, స్ట్రోక్ వంటి జబ్బులు రావడానికి స్మోకింగ్ యే ప్రధాన కారణం. ధూమపానం  మీ శరీరంలో మంటను కలిగిస్తుంది. అలాగే రక్త నాళాలు సంకోచించడానికి కారణమవుతుంది.
 

కొలెస్ట్రాల్ స్థాయిలు 

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మీరు తినే ఆహారం కొవ్వు పెంచేదిగా లేకుండా చూసుకోండి. దీంతో మీరు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

తాగొద్దు

స్పెషల్ డేస్ సందర్భంగా చాలా మంది రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ఒక గ్లాసు బీర్ లేదా ఒక గ్లాసు వైన్ ను తాగుతుంటారు. తక్కువ మొత్తంలో దీన్ని తాగడం వల్ల వచ్చే సమస్యలేమీ లేవు. కానీ మందును ఎక్కువగా తాగితే మాత్రం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఉంది. 

click me!