మీ స్పెర్మ్ తెల్లగా కాకుండా పసుపు రంగులో ఉందా? అయితే ఆ సమస్యే కారణం కావొచ్చు..

First Published Dec 30, 2023, 1:59 PM IST

మగవారిలో వీర్యకణాల నాణ్యత, వీర్యకణాల సంఖ్య వారి ఆరోగ్యాన్ని సూచిస్తాయి. అవును వీర్యం రంగు కూడా మగవారిలో ఎన్నో సమస్యలను సూచిస్తుంది. ముఖ్యంగా తెల్లగా కాకుండా పసుపు రంగులో ఉంటే వారికి కొన్ని సమస్యలున్నట్టేనంటున్నారు నిపుణులు. 

వీర్యం మందపాటి జెల్లీ లాంటిది. ఇది లైంగిక చర్య సమయంలో పురుష జననేంద్రియాల నుంచి విడుదల అవుతుంది. సాధారణంగా ఇది తెల్ల రంగులోనే ఉంటంది. ఇది ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడనడాన్ని సూచిస్తుంది. అయితే కానీ కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా పురుషుల వీర్యకణాల రంగు కూడా పసుపు రంగులోకి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా వీర్యం పసుపు రంగులోకి మారడానికి అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఇన్ఫెక్షన్

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా కొన్నిసార్లు పురుషుల వీర్యం రంగు తెలుపు కాకుండా పసుపు రంగులోకి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రోస్టేట్ గ్రంథిలోకి బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల ప్రోస్టాటిటిస్ అని పిలువబడే యూటీఐ బారిన పడతారు. ఇదే వీర్యం పసుపు రంగులోకి మారడానికి కారణమవుతుంది. 
 

sperm

కామెర్లు

కామెర్ల వల్ల కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారుతాయన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఎవరైతే కామెర్లతో బాధపడతారో.. ఆ వ్యక్తి వీర్యం రంగు పసుపు రంగులోకి మారుతుందని నిపుణులు అంటున్నారు. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం వల్ల ఇలా స్పెర్ప్ పసుపు రంగులోకి మారుతుంది. 

sperm

సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ (ఎస్టీడీ)

అసురక్షిత సెక్స్ వల్ల ఎన్నోసమస్యల బారిన పడతారు. ఇలాంటి సమస్యల్లో సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కూడా ఉంది. ఒకవ్యక్తి లైంగిక సంక్రమణ వ్యాధి లేదా ఎస్టీడీతో బాధపడుతుంటే.. వారి వీర్యం రంగు పసుపు రంగులో కనిపిస్తుంది.
 

బయోస్పెర్మియా

పురుషుల్లో తెల్ల కణాలు పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ కారణంగా వీర్యకణాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో కొన్ని కొన్ని సార్లు వీర్యం రంగు పసుపు రంగులోకి మారుతుంది. 
 

ఇలా చేయడం మర్చిపోకండి

శరీరంలో ఏవైనా మార్పులు అంటే మునుపెన్నడూ మీలో కలగని మార్పులు ఉంటే వెంటనే  హాస్పటల్ కు వెళ్లండి. అలాగే ఇన్ఫెక్షన్ లేదా ఎస్టీడీ స్పెర్మ్ పసుపురంగులోకి మారడానికి కారణమైతే యాంటీబయాటిక్స్ తో చికిత్స తీసుకోండి. 

click me!