గాలిలో సల్ఫర్, నైట్రేట్లు, అమ్మోనియా, సోడియం, క్లోరైడ్, బ్లాక్ కార్బన్, ఖనిజాల ధూళి వంటివన్నీ కాలుష్య కణలే (Pollution particles). గాలిలో ఉండే అతి చిన్న కణాలన్నిటినీ మనం పీల్చుకున్నప్పుడు ఆరోగ్యానికి హాని (Harm) కలుగుతుంది. 10 మైక్రో మీటర్లు కంటే పెద్ద కణాలను మాత్రమే ముక్కు, ఊపిరితిత్తులు ఫిల్టర్ చేస్తాయి. అంతకంటే చిన్న కణాలు ఊపిరితిత్తులు, ముక్కులోకి వెళ్లగలవు.