బీట్ రూట్ లో మెగ్నీషియం, జింక్, కాపర్, పొటాషియం వంటి తదితర పోషకాలు (Nutrients) సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉంటాయి. ఈ ఔషధ గుణాలు పోషకాహార లోపం, త్వరగా అలసిపోవడం లేదా నీరసించడం, జుట్టురాలిపోవడం ఇలా మొదలగు అనేక సమస్యలకు దివ్యౌషధంగా (Divine medicine) సహాయపడతాయి.