షుగర్ ఉందా ? చెవుడు సమస్యతో జాగ్రత్త..

Bukka Sumabala   | Asianet News
Published : Oct 07, 2020, 05:35 PM IST

చెప్పిన మాట సరిగా వినిపించుకోకపోతే చెవుడా అనడం కామనే. అయితే నిజంగానే చెవుడు ఉన్నవాళ్లను గుర్తించడం ఎలా? చెవుడు రాకుండా ముందే అరికట్టవచ్చా చూద్దాం.. 

PREV
110
షుగర్ ఉందా ? చెవుడు సమస్యతో జాగ్రత్త..

చెప్పిన మాట సరిగా వినిపించుకోకపోతే చెవుడా అనడం కామనే. అయితే నిజంగానే చెవుడు ఉన్నవాళ్లను గుర్తించడం ఎలా? చెవుడు రాకుండా ముందే అరికట్టవచ్చా చూద్దాం.. 

చెప్పిన మాట సరిగా వినిపించుకోకపోతే చెవుడా అనడం కామనే. అయితే నిజంగానే చెవుడు ఉన్నవాళ్లను గుర్తించడం ఎలా? చెవుడు రాకుండా ముందే అరికట్టవచ్చా చూద్దాం.. 

210

చెవుడులో కూడా నాలుగు రకాలుంటాయి. వీటినై స్టేజెస్ అంటారు. మైల్డ్ డెఫ్నెస్, మోడరేట్ డెఫ్నెస్, సివియర్ డెఫ్నెస్, ప్రొఫౌండ్ డెఫ్నెస్ అని నాలుగు రకాలు. మైల్డ్ లో కాస్త గట్టిగా మాట్లాడితే వినబడుతుంది. ప్రొఫౌండ్ కు వచ్చేసరికి అసలేమీ వినబడదు. సివియర్ లో అరిస్తే తప్ప విబడదు. మోడరేట్ లో గట్టిగా మాట్లాడితే వినబడుతుంది. 

310

కొంత మందికి పుట్టుక తోనే ఈ సమస్య ఉంటే మరి కొంత మందికి యాక్సిడెంట్ వలనో, ఏదైనా వ్యాధి వలనో ఈ సమస్య వస్తుంది. చాలా మందికి లక్షణాలు నెమ్మదిగా పెరుగుతూ వస్తాయి.

410

పుట్టిన పిల్లల్లో వినికిడి సమస్యను ఎలా తెలుసుకోవచ్చంటే.. నాలుగు నెలల లోపు అయితే శబ్దం వచ్చిన వైపు పాపతల తిప్పకుండా ఉంటే, సంవత్సరంలోపు మాట్లాడకుండా ఉంటే, ఎంత పెద్ద శబ్దం అయినా ఉలిక్కి పడకుండా ఉంటే వినికిడి సమస్య ఉందని నిర్థారించుకోవచ్చు. 

510

కంటికి కనిపిస్తే తప్ప రెస్పాండ్ కాకుండా ఉండడం చూడా వినికిడి లోపంగా గుర్తించాలి. కేవలం కొన్ని చప్పుళ్లు మాత్రమే గుర్తిస్తుంటే అది కూడా ఒక లక్షణమే. 

610

పెద్దవారిలో వినికిడి సమస్యను ఈ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఏదైనా మాట్లాడినప్పుడు మళ్ళీ రిపీట్ చేయమని అడుగుతారు. ఫోన్ లో సరిగ్గా వినలేకపోతున్నామని చెబుతారు. డోర్ బెల్ మోగుతున్నా వినిపించదు. 

710

ఎదురుగా మాట్లాడుతుంటూ బాగా శ్రద్ధపెట్టి వింటుంటారు. చప్పుడు వినబడుతుంది కానీ అదెక్కడి నుండి వస్తుందో గ్రహించలేకపోవడం. ఒకేసారి ఐదారుగురు మాట్లాడుతుంటే ఎవరేం మాట్లాడుతున్నారో తెలియకపోవడం.  టీవీ, రేడియో ఎక్కువ సౌండ్ లో వినడం. ఒకటి చెప్తే ఒకటి అర్ధం చేసుకుంటారు

810

చికెన్ పాక్స్, మెనింజైటిస్, సికిల్ సెల్ డిసీజ్,సిఫిలిస్, డయాబెటీస్, టీబీ కోసం వాడే కొన్ని మందులు,హైపోథైరాయిడిజం, ఆర్థ్రైటిస్, కొన్ని కాన్సర్లు, వయసు, ఏదైనా పెద్ద చప్పుడు వినడం, తలకి ఏదైనా గాయం అవ్వడం వంటివన్నీ  వినికిడి సమస్య రావడానికి కారణాలే. 

910

అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వినికిడి లోపం రాకుండా చేయవచ్చు.
పుట్టుక తో వచ్చిన, లేదా ఏదైనా డిసీజ్ వల్లనో, యాక్సిడెంట్ వల్లనో వచ్చిన వినికిడి లోపానికి ఎవరేం చేయలేదు. కానీ పెద్ద పెద్ద మ్యూజిక్ కి దూరం గా ఉండడం, టీవీ, రేడియో తక్కువ సౌండ్ తో వినడం, చుట్టు పక్కల ఎక్కువ చప్పుళ్ళున్నప్పుడు వాల్యూం పెంచకుండా ఫోకస్ చేయటం ద్వారా వినడానికీ, అర్ధం చేసుకోవడానికీ ట్రై చేయడం.

1010

మీ వర్క్ ప్లేస్ లో బాగా చప్పుళ్ళు ఉంటే ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం, మీరు వెళ్ళిన ఏదైనా ఈవెంట్ లో నాయిస్ బాగా ఎక్కువగా ఉంది అనుకుంటే వెంటనే ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం, క్యూ-టిప్స్, టిష్యూస్, కాటన్ స్వాబ్స్ వంటివి చెవి లోపలి దాకా దూర్చకుండా ఉండడం వల్ల భవిష్యత్తులో వినికిడి లోపం రాకుండా జాగ్రత్త పడొచ్చు. 

click me!

Recommended Stories