కరోనా వేళ... ఈ బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే...!

First Published Apr 24, 2021, 12:20 PM IST

ఈ కరోనా మహమ్మారి ఊపిరితిత్తులపై ఎక్కువగానే ప్రభావం చూపిస్తోంది. మరి దీని బారినుంచి బయటపడాలంటే.. మార్గమే లేదా అంటే.. కొన్ని రకాల బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

కరోనా మహమ్మారి దేశంలో తీవ్ర రూపం దాలుస్తోంది. చాలా మంది కరోనా సోకిన తర్వాత ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలు కోల్పోకపోయినా.. ఈ కరోనా మహమ్మారి ఊపిరితిత్తులపై ఎక్కువగానే ప్రభావం చూపిస్తోంది. మరి దీని బారినుంచి బయటపడాలంటే.. మార్గమే లేదా అంటే.. కొన్ని రకాల బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
undefined
1. ఉజ్జయి ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం అనే పదం "ఉజ్జయి" అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది, అంటే జయించడం. ఈ రకమైన శ్వాసను సాధన చేయడం వలన ఏకాగ్రత మెరుగుపడుతుంది, శరీరమంతా ఉద్రిక్తతను విడుదల చేస్తుంది, శరీరం అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల పనితీరును ప్రోత్సహిస్తుంది. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే.. మీ కళ్ళు మూసుకుని, వెన్నెముక తటస్థంగా ఉంచే ఏదైనా ధ్యాన భంగిమలో నేలపై కూర్చోండి.తర్వాత మీ నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ వదలాలి.. ఊపిరితిత్తుల నిండా గాలి నింపి.. ఆ తర్వాత నెమ్మదిగా వదలడం లాంటివి చేయాలి.
undefined
2.కపల్‌భతి ప్రాణాయామం కపల్‌భతి ప్రాణాయామం. దీనిలో శ్వాస నెమ్మదిగా తీసుకోని వదలాలి. పొట్ట వద్ద బిగపట్టి.. దీనిని చేయాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు నెట్టడానికి ఇది సహాయపడుతుంది. ఏకాగ్రత స్థాయిని పెంచడానికి కూడా సహాయం చేస్తుంది.ఊపిరితిత్తుల కండరాలను బలోపేతం చేయడానికి ఈ రకమైన ప్రాణాయామం అద్భుతమైనది. ఫోటోలో చూపించిన విధంగా కూర్చోవాలి. దీనిలో వెన్నుముక నిటారుగా పెట్టి కూర్చోవాలి. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. ఊపిరిపీల్చుకునే సమయంలో పొట్టను వెన్నుముక వైపు వెనక్కి బిగపట్టాలి. ఇలా ఆపకుండా పది సార్లు చేసి.. ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలి.
undefined
3. నాడీ శోధన ప్రాణయామం.. దీనినే నాసిక శ్వాస ప్రాణయామం అని కూడా పిలుస్తారు. ఈ ప్రాణయామం ఒత్తిడి తగ్గిస్తుంది. బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వడానికి సహాయపడుతుంది. దీనిలో నేలపై నిటారుగా కూర్చోవాలి. ఆతర్వాత కాసేపు నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఒక చేతిని కాలిపై పెట్టి.. మరో చేతి బొటన వేలితో ముక్కును మూసి.. ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలి.
undefined
4. ఉదర శ్వాస.. పొట్టతో చేసే వ్యాయామం ఇది. ఉదర శ్వాస లేదా బొడ్డు శ్వాస అని కూడా పిలుస్తారు. డయాఫ్రాగ్మాటిక్ శ్వాస పూర్తి ఆక్సిజన్ మార్పిడిని ప్రోత్సహిస్తుంది. ఈ రకమైన శ్వాస హృదయ స్పందనను తగ్గిస్తుంది. రక్తపోటును కూడా స్థిరీకరిస్తుంది. అంతేకాకుండా, ఉదర శ్వాస సడలింపు, ఒత్తిడి తగ్గించడం లో సహాయం చేస్తుంది. ఎలా చేయాలంటే.. మీ మోకాలు.. తల క్రింద ఒక దిండు పెట్టుకొని నేల పై పడుకోవాలి. ఒక చేతిని పొట్టపైన మరొక చేతిని గుండె మీద ఉంచండి. ఇప్పుడు మీ ముక్కు ద్వారా ఊపిరిపీలుస్తూ వదులుతూ ఉండాలి. ఆ ప్రభావం పొట్టపై పడేలా చూసుకోవాలి.
undefined
click me!