ఎండాకాలంలో మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..!

Published : May 21, 2023, 04:26 PM IST

వాతావరణం కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ప్రతి సీజన్ లో గుండెను ఆరోగ్యంగా ఉంచే చిట్కాలను ఫాలో కావాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

PREV
17
 ఎండాకాలంలో మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..!

ఎండాకాలం ఎండలో పిల్లలు, పెద్దలు చాలా సరదాగా గడుపుతారు. అయినప్పటికీ వేడి మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా మన గుండెను దెబ్బతీస్తుంది. వేడి గుండెను ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. వేడి వాతావరణంలో రక్త నాళాలు విస్తరించడానికి, గుండె రక్తాన్ని పంప్ చేయడానికి బాగా కష్టపడుతుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. ఇది తేలికపాటి తలనొప్పి, మూర్ఛ, కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు కూడా దారితీస్తుంది.

27

అంతేకాదు వేండి నిర్జలీకరణానికి దారితీస్తాయి. ఇది రక్తం గడ్డకట్టడం, గుండె దడ పెరగడం, గుండె ఒత్తిడి ప్రమాదాన్నిపెంచుతుంది. అందుకే ఎండాకాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం హైడ్రేటెడ్ గా ఉండాలి. పలుచని, కాటన్ దుస్తులను వేసుకోవాలి. మీ శారీరక కార్యకలాపాల పట్ల జాగ్రత్త వహించాలి. మందును ఎక్కువగా తాగకూడదు. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ఎండాకాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37
Image: Getty

హైడ్రేటెడ్ గా ఉండండి

ఎండాకాలం వేడి మనకు సాధారణం కంటే ఎక్కువ చెమట పట్టేలా చేస్తుంది. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. నిర్జలీకరణం మీ రక్తం చిక్కగా మారడానికి కారణమవుతుంది. దీంతో మీ గుండె రక్తాన్ని పంప్ చేయడానికి బాగా కష్టపడుతుంది. అందుకే ఇలాంటి సమస్య రావొద్దంటే పుష్కలంగా ద్రవాలు ముఖ్యంగా నీటిని తాగడం చాలా ముఖ్యం. శారీరకంగా చురుగ్గా ఉంటే రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగండి. మీరు హైడ్రేట్ గా ఉండటానికి పండ్లు, కూరగాయలు వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. 

47

శారీరక కార్యకలాపాలు

ఎండాకాలంలో చాలా మంది బయటకు వెళ్లి స్విమ్మింగ్, హైకింగ్ లేదా బైకింగ్ వంటి కొన్ని శారీరక కార్యకలాపాలను ఆస్వాదిస్తుంటారు. కానీ ఇవి మీ గుండెను రిస్క్ లో పడేస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి. మీరు ఏం చేయాలి? ఏం చేయకూడదో డాక్టర్ ను అడిగిన తర్వాతే చేయండి. ఏదైనా పని చేసేటప్పుడు మైకంగా అనిపించినా లేదా ఛాతీ నొప్పి వచ్చినా వెంటనే  హాస్పటల్ కు వెళ్లండి. 
 

57

వాతావరణానికి తగ్గ దుస్తులు

ఎండాకాలంలో మీ గుండెను రక్షించడానికి తగిన దుస్తులను వేసుకోవడం చాలా అవసరం. వదులుగా ఉండే, లేత రంగు దుస్తులు చల్లగా ఉండటానికి, మీ శరీరం వేడెక్కకుండా ఉండటానికి సహాయపడతాయి. టోపీలు, సన్ గ్లాసెస్ కూడా సూర్యుని హానికరమైన కిరణాల నుంచి మీ తల, కళ్లను రక్షించడానికి సహాయపడతాయి. మీరు ఎక్కువ సేపు బయట ఉంటే మీ చర్మాన్ని రక్షించడానికి సన్స్క్రీన్ ను ఉపయోగించండి. 

67

అతిగా మందు తాగకండి

మందును అతిగా తాగడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మందు మీ గుండె ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది. మందును ఎక్కువగా తాగడం వల్ల అధిక రక్తపోటు, సక్రమంగా లేని హృదయ స్పందన, మీ గుండె కండరాలు దెబ్బతింటాయి. ఒకవేళ తాగినా లిమిట్ లోనే తాగండి. అలాగే హైడ్రేట్ గా ఉండండి. 
 

77

మానసిక ఆరోగ్యం 

శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా గుండె విషయానికొస్తే.. ఒత్తిడి, ఆందోళన, నిరాశ అన్నీ మీ గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే వీలైనంత ఎక్కువ సేపు రెస్ట్ తీసుకోండి. అలాగే పుస్తకాన్ని చదవడం, యోగా చేయడం, వాకింగ్ కు వెళ్లడం వంటి పనులను చేయండి. 

click me!

Recommended Stories