HealthTips: సాధారణంగానే కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాంటిది అందులో నిమ్మరసం కలిపితే శరీరానికి మిరాకిల్ బెనిఫిట్స్ ని ఇవ్వవచ్చు. ఈ కాంబినేషన్లో డ్రింక్ తాగడం వల్ల వచ్చే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
16
కొబ్బరి నీరు అనేది ఏ వయసు వారైనా ఏ సీజన్లో అయినా తాగగలిగే పానీయం. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నీరు సహజ సిద్ధంగా లభించే ఖనిజ లవణాలు కలిగిన పానీయం. కొబ్బరి నీరు మీ అంతర్గత శారీరక విధులకు సమానమైన ఆశాజనక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
26
ఈ రుచికరమైన పానీయం ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా అనిరభ్యంతరంగా తాగవచ్చు. అలాంటి ఈ కొబ్బరి నీటిలో నిమ్మరసం కలపటం వలన మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కొబ్బరి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగటం వలన శరీరం డిహైడ్రేషన్ కి గురికాకుండా ఉంటుంది.
36
కొబ్బరి నీటిలో పొటాషియం, క్లోరిన్ తగినంత మోతాదులో ఉంటుంది. అది పరిమిత సంఖ్యలో ఉండే అల్బుమిన్, నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచర్ రెండు కలవటం వలన మూత్రపిండా సంబంధిత వ్యాధులు మూత్ర విసర్జనలోని లోపాలు, కిడ్నీలోని రాళ్లు వంటి సమస్యలను నివారించడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది.
Related Articles
46
గర్భిణీ స్త్రీలకి, కడుపులో వికారంగా ఉన్న పిల్లలకి నిమ్మరసం కలిపిన కొబ్బరి నీళ్లు ఇవ్వటం వలన వాంతుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కొబ్బరినీళ్లు నిమ్మరసం యొక్క కాంబినేషన్ డ్రింక్ తాగటం వలన శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది.
56
కడుపులో పేగు నుంచి హానికరమైన బ్యాక్టీరియాలని తొలగిస్తుంది ఈ ద్రవం అలాగే కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం, క్లోరిన్ ఉండడం వలన నిమ్మరసంలో మితంగా కలిపి తాగటం వలన స్టమక్ అల్సర్ వంటి లక్షణాలని త్వరగా నివారించవచ్చు.
66
కొబ్బరి నీరు నిమ్మరసం యొక్క మిశ్రమానికి ఆస్మాని తగ్గించే గుణం ఉంది అలాగే సహజంగా బరువు తగ్గించుకోవడానికి చాలామంది నిమ్మకాయ నీటిలో తేనె కలుపుకొని తాగుతారు. కానీ కొబ్బరి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగటం వలన కూడా శరీర బరువుని తగ్గించుకోవచ్చు.