ప్రతిరోజూ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే...!

First Published Feb 19, 2021, 11:19 AM IST

నిమ్మకాయలో కేవలం విటమిన్ సీ మాత్రమే కాదు.. కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కొర్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి.

ఉదయం లేవగానే.. మంచినీరు తాగే అలవాటు చాలా మందిలో ఉంటుంది. అయితే... సాధారణ నీటికి బదులు.. నిమ్మరసం తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
undefined
చాలా మంది కేవలం బరవు తగ్గడానికి మాత్రమే.. ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగుతారు. అయితే.. అంతకు మించిన ప్రయెజనాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
undefined
నిమ్మకాయలో కేవలం విటమిన్ సీ మాత్రమే కాదు.. కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కొర్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి.నిమ్మకాయ నీరు యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. దీని వల్ల వయసు పెరుగుతున్నా చర్మాన్ని త్వరగా ముడతలు పడనీయదు. నిమ్మలో దొరికినంత సి విటమిన్ పండ్లలోనూ లభించదు.
undefined
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఉదయాన్నే నిమ్మరసం కలిపిన నీరు తాగడం వల్ల బాడీ హైడ్రేట్ అవుతూ ఉంటుంది. అంతేకాదు జ్వరం, జలుబు, గొంతు నొప్పి లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
undefined
శరీరంపై ముడతలను తొలగించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. స్కిన్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
undefined
పంటినొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని సైతం నియంత్రిస్తుంది. కొన్నిసార్లు పొరపాటున కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడితే.. నిమ్మరసం తాగిస్తే వారికి ఉపశమనం కలిగిస్తుంది.
undefined
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగుతారు.కిడ్నీలో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కరిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కారణంగానే నిమ్మరసం తాగాలని వైద్యులు తరచుగా సూచిస్తుంటారు.
undefined
click me!