cholesterol
కొలెస్ట్రాల్ పెరగడమనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ఎందుకంటే ఇది మనల్నిసులువుగా చంపేస్తుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్. రెండు చెడు కొలెస్ట్రాల్ . శరీరానికి మంచి కొలెస్ట్రాల్ అవసరం. కానీ చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి.
Cholesterol
ఇది మనల్ని ఊబకాయం బారిన పడేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని నియంత్రించడం చాలా అవసరం. అయితే కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కొన్ని ఆహారాలు ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే..
అవొకాడో
అవొకాడోలో పోషకాలు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవొకాడోల నుంచి వచ్చే ఫైబర్స్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను, ల్డిఎల్ కొలెస్ట్రాల్ నాణ్యతను మెరుగుపరుస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్తాయిలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు అవోకాడోలను తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
apples
ఆపిల్స్
ఆపిల్స్ లో పెక్టిన్ ఫైబర్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు. ఆపిల్ పండు అనారోగ్యకరమైన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధమనులు గట్టిపడకుండా నిరోధించడానికి కూడా ఈ పండు సహాయపడుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
సిట్రస్ పండ్లు
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. ఈ పండ్లలో హెస్పెరిడిన్ ఉంటుంది. ఇది అధిక రక్తపోటు లక్షణాలను కూడా తగ్గిస్తుంది. ఈ పండ్లు మీ ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి.
బొప్పాయి
బొప్పాయి పండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే ఇది చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
banana
అరటిపండ్లు
అరటి పండ్లలో ఉండే ఫైబర్, పొటాషియం కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి. అరటిపండ్లు కరిగే ఫైబర్స్ కు మంచి మూలం. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మీకు తక్షణ శక్తిని అందిస్తుంది.