ఉదయమా లేక సాయంత్రమా.. ఎప్పుడు వాకింగ్ చేస్తే మంచిది?

First Published | Jun 6, 2024, 1:01 PM IST


కొంతమంది ఉదయం వాకింగ్ కు వెళితే.. మరికొంతమంది సాయంత్రం పూట వాకింగ్ కు వెళుతుంటారు. అయితే ఏ పూట వాకింగ్ చేస్తే ఎక్కువ మంచిది అనే దానిపై ఆరోగ్య నిపుణులు ఏంమంటున్నారంటే? 
 

వాకింగ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాకింగ్ కంఫర్ట్ వ్యాయామమే అయినా.. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వాకింగ్ మీరు ఎక్కడైనా చేయొచ్చు. కానీ రోజూ వాకింగ్ చేయడం వల్ల మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండగలుగుతారు. వాకింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే కొంతమంది ఉదయం వాకింగ్ కు వెళితే మరికొంతమంది మాత్రం సాయంత్రం పూట వాకింగ్ చేస్తుంటారు. అసలు ఏ పూట వాకింగ్ చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మార్నింగ్ వాక్ ప్రయోజనాలు

మార్నింగ్ వాక్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. మార్నింగ్ వాక్ మీ జీవక్రియను ప్రారంభిస్తుంది. అలాగే కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. అంటే మీరు 30 నిమిషాల పాటు నడిచినా ఎక్కువ కొవ్వు కరుగుతుంది. మీరు బరువు తగ్గుతారు.  అలాగే ఉదయపు నడక వల్ల మీకు సూర్యరశ్మి తగులుతుంది. ఇది మీ శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన విటమిన్ డి ని అందిస్తుంది. ఈ విటమిన్ డి ఎముకలను బలంగా చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. 
 


మార్నింగ్ వాక్ వల్ల కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే? ఇది మీ మనస్సును ఒత్తిడికి దూరం చేస్తుంది. శారీరక శ్రమతో మీ రోజును ప్రారంభించడం వల్ల ఎండార్ఫిన్లు పెరుగుతాయి. వీటినే మనం  "ఫీల్-గుడ్" హార్మోన్లు అని  అంటాం. ఇది ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యలను తగ్గిస్తాయి. 

అంతేకాకుండా ఉదయపు నడక కూడా మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఉదయం వాకింగ్ కు వెళ్లే వారు రాత్రిపూట బాగా నిద్రపోతారని పరిశోధనలో తేలింది. ఎందుకంటే క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేస్తే  మీ సిర్కాడియన్ లయ నియంత్రణలో ఉంటుంది. ఇది మీరు టైం కు నిద్రపోవడం, టైం కు  నిద్రలేచేలా చేస్తుంది. 
 

ఈవెనింగ్ వాక్ ప్రయోజనాలు 

సాయంత్రపు నడక వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం మీరు విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. వాకింగ్ కండరాలలో ఉద్రిక్తతను విడుదల చేస్తుంది. అలాగే విశ్రాంతిని ప్రోత్సహిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది స్క్రీన్, పరధ్యానాల నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఇది మీ పరిసరాలపై దృష్టి పెట్టడానికి, ఏదైనా ప్రతికూల ఆలోచనలు లేదా ఆందోళనలను వదిలివేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా  సాయంత్రపు నడక కూడా మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. భోజనం తర్వాత నడిస్తే జీర్ణవ్యవస్థకు రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇలా జీర్ణక్రియకు సహాయపడుతుంది.

సాయంత్రపు నడక వల్ల కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే? ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఉదయపు నడక మాదిరిగానే, సాయంత్రపు నడక కూడా మీ సిర్కాడియన్ లయను నియంత్రిస్తుంది. అంటే ఇది కూడా మీరు రాత్రిపూట బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. 
 


అలాగే ప్రియమైనవారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కూడా సాయంత్రం నడక కూడా గొప్ప మార్గం. మీరు మీ భాగస్వామి లేదా పిల్లలు లేదా మీ పెంపుడు జంతువులతో కూడా వాకింగ్ కు వెళ్లొచ్చు. ఇది మీకు మంచి అనుభూతిని ఇస్తుంది.  

ఏది మంచిది?

ఉదయం, సాయంత్రం నడక ప్రయోజనాలను చూసిన తర్వాత.. ఈ రెండూ మన మొత్తం ఆరోగ్యానికి సమానమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఏదేమైనా ఎప్పుడు వాకింగ్ కు వెళ్లాలనే విషయం  వ్యక్తిగత ప్రాధాన్యతలు, జీవనశైలి కారకాలపై ఆధారపడి ఉంటుంది. 

Latest Videos

click me!