దుస్తులు లేకుండా నిద్రపోతే ఏమౌతుందో తెలుసా?

First Published | May 28, 2024, 10:56 AM IST

ఎండాకాలంలో లూజ్ ఫిట్టింగ్, కంఫర్ట్ గా ఉండే దుస్తులనే ఎక్కువగా వేసుకుంటుంటారు. అయితే కొంతమంది ఎండాకాలంలో మొత్తమే దుస్తులు లేకుండా నిద్రపోతుంటారు. కానీ ఇలా పడుకోవడం వల్ల ఏమౌతుందో తెలుసా.

naked sleep

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల   ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో దుస్తులు లేకుండా పడుకోవడం వల్ల రాత్రిళ్లు చెమట పట్టదు. అలాగే శరీరం బాగా రిలాక్స్ అవుతుంది.  అంతేకాదు దుస్తులు లేకుండా నిద్రపోవడం ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 

బరువు తగ్గడానికి.. 

దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుందట.  అలాగే బరువు అదుపులో ఉంచడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇలా నిద్రపోవడం వల్ల మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల శరీరం చల్లగా ఉండి రిలాక్స్ అయ్యి మీకు బాగా నిద్రపోవచ్చు.
 

Latest Videos


naked sleep

సంతానోత్పత్తి..

టైట్ గా ఉండే లోదుస్తులు వేసుకుని నిద్రపోయే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది.  మీరు టైట్ గా ఉండే దుస్తులు వేసుకుని నిద్రపోతే అది వృషణాలకు అసౌకర్యం కలిగిస్తుంది. దీని చెడు ప్రభావం సంతానోత్పత్తిపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. లోదుస్తులు తీసేసి నిద్రపోవడం వల్ల వీర్యకణాల సంఖ్య మెరుగుపడుతుంది. అలాగే చెమట వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు రావు. 

ఒత్తిడి ఉపశమనం..

దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి సర్వ సాధారణ సమస్యగా మారింది. దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు విడుదలై శరీరం రిలాక్స్ అవుతుంది.


గుండె ఆరోగ్యం.. 

దుస్తులు లేకుండా నిద్రపోవడం బాగా నిద్రపడుతుంది. అందుకే కంటినిండా నిద్రపోవడం వల్ల మీకు గుండెకు సంబంధించిన సమస్యలు రావు. కంటినిండా నిద్రపోవడం వల్ల మధుమేహం, గుండెజబ్బులు, హైపర్ టెన్షన్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అలాగే తర్వాతి రోజు మీరు ఎనర్జిటిక్ గా పనిచేసుకోగలుగుతారు. 

యోని ఆరోగ్యం.. 

దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల మహిళల యోని ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది. ఎండాకాలంలో చెమట ఎక్కువగా పడుతుంది. ఇది యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే దురద, ఎరుపు వంటి సమస్యలను పెంచుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు దుస్తులు లేకుండా నిద్రపోతే యోనికి సంబంధించిన సమస్యలు రావు. 

click me!