తినడానికి ముందు మామిడి పండ్లను ఖచ్చితంగా నీళ్లలో నానబెట్టండి.. లేదంటే?

Published : Apr 20, 2023, 11:44 AM IST

మామిడి పండ్లను తినడానికి ముందు నీళ్లలో ఖచ్చితంగా నానబెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.   

PREV
15
తినడానికి ముందు మామిడి పండ్లను ఖచ్చితంగా నీళ్లలో నానబెట్టండి.. లేదంటే?
Mangoes

మామిడి పండ్లను నీటిలో నానబెట్టి తినడం ఏండ్ల నుంచి కొనసాగుతోంది. అయితే ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. మామిడి పండ్లలో ఉండే కలుషిత పదార్థాలను తొలగించడానికి ఇది చాలా అవసరం. మామిడి పండ్లను తింటే మొటిమలు వస్తాయని చాలా మంది అంటారు. దీనికి తోడు ఈ పండ్లు ఒంట్లో వేడిని పెంచుతాయి. అలాగే మలబద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్, ఇతర జీర్ణశయాంతర సమస్యలకు కూడా దారితీస్తుంది. ఈ సంగతి పక్కన పెడితే మామిడి పండ్లను తినడానికి ముందు నీటిలో ఎందుకు నానబెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

25

ఫైటిక్ ఆమ్లం విడుదలవుతుంది

మామిడిలో ఫైటిక్ యాసిడ్ అని పిలువబడే సహజ పదార్ధం ఉంటుంది. ఇది యాంటీ-న్యూట్రియంట్ గా పరిగణించబడుతుంది. ఫైటిక్ ఆమ్లం కాల్షియం, ఇనుము, జింక్ వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. ఇది శరీరంలో ఖనిజ లోపాలకు దారితీస్తుంది. అయితే మామిడి పండ్లను కొన్ని గంటలు నీటిలో నానబెట్టడం వల్ల ఫైటిక్ ఆమ్లం తొలగిపోతుంది. 
 

35

 పురుగుమందులను తొలగించడానికి సహాయపడుతుంది

మామిడి పండ్లను పండించడానికి ఎన్నో రకాల పురుగు మందులను వాడుతారు. ఈ రసాయనాలు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కలిగిస్తాయి. తలనొప్పి, మలబద్ధకం, ఇతర సమస్యలను కలిగిస్తాయి. ఈ రసాయనాలు చాలా ప్రమాదకరం. చర్మం, కళ్లు, శ్వాసనాళానికి చికాకును కలిగిస్తాయ. అలాగే అలెర్జీలను కలిగిస్తాయి. వీటన్నింటిని నివారించాలంటే.. మామిడి పండ్లను నీటిలో నానబెట్టాలి.
 

45

mango

వేడిని తగ్గిస్తుంది

మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల దానిలోని వేడిగుణం తగ్గుతుంది. మామిడి పండ్లలోని వేడి ముఖంపై మొటిమలను వచ్చేలా చేస్తుంది. అంతేకాదు వికారం, వాంతులు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే మామిడి పండ్ల వేడిని తగ్గించుకోవాలంటే తినడానికి ముందు కనీసం 25 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టండి. 
 

55

అంతేకాదు ఇలా మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టడం వల్ల మామిడిలోని అన్ని హానికరమైన పదార్థాలు బయటకు పోతాయి. అందుకే మామిడి పండ్లను తినడం వల్ల కలిగే అన్ని నష్టాలను నివారించాలనుకుంటే వాటిని తినడానికి ముందు వాటిని నీటిలో ఖచ్చితంగా నానబెట్టండి. అయితే ఇందుకోసం మామిడి పండ్లను 30 నిమిషాల నుంచి గంటసేపు నానబెట్టాలి. 

 
 

click me!

Recommended Stories