గుండె ఆరోగ్యంగా ఉండాలా..? ఇవి చేయండి చాలు..!

Published : Apr 18, 2023, 02:09 PM IST

గుండె ఆరోగ్యంగా ఉండటానికి వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం అవసరం. కనీసం నడిచినా సరిపోతుంది.

PREV
19
గుండె ఆరోగ్యంగా ఉండాలా..? ఇవి చేయండి చాలు..!
Image: Getty Images

ఈరోజుల్లో చిన్న వయసువారు కూడా... గుండె సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్నటి వరకు మన కళ్లకు ఆరోగ్యంగా కనిపించినవారే... అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి సమయంలో... మనం గుండె ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలి. మరి మన గుండె పదిలంగా ఉండాలంటే కఠోర శ్రమ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దాం..

29
walking

ఫిజికల్ యాక్టివిటీ ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. ఇది గుండెకు మెడిసిన్ లా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండటానికి వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం అవసరం. కనీసం నడిచినా సరిపోతుంది.

39
fruits

మీరు భోజనం చేసే ప్లేట్ ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తో నిండి ఉంటే... మీ గుండె అంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే.. ప్రతిరోజూ సీజనల్ పండ్లు, కూరగాయలు కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి.

49

మీరు డైరెక్ట్ గా ఉప్పు తీసుకున్నా, ఉప్పు కలిసి ఉండే ఆహారం తిన్నా కూడా గుండెకు చేటు చేసినట్లే. అందుకే... అలాంటి ఆహారాలను దూరంగా ఉంచడం అవసరం. అంటే.. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
 

59
Tips for control diabetics

డయాబెటిక్స్, గుండె జబ్బులకు ఒకదానితో మరొకదానికి దగ్గరి సంబంధం ఉంది. కాబట్టి... గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే... రెగ్యులర్ గా డయాబెటిక్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
 

69

రక్తంలో కొలిస్ట్రాల్ లెవల్స్ 200 కు మించి ఉండకూడదు. అలా మించింది అంటే ప్రమాదంలో ఉన్నారని అర్థం. కాబట్టి... కొలిస్ట్రాల్ లెవల్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ఉంటే.. దానికి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.

79

పొగతాగడం గుండె ప్రమాదాన్ని పెంచుతుంది. మీ గుండె ప్రమాదాన్ని తగ్గించుకోవాలి అంటే... కచ్చితంగా.. వెంటనే పొగతాగడం ఆపేయాలి.
 

89
cooking oil

గుండె ఆరోగ్యానికి సహాయపడే నూనెలను ఉపయోగించాలి. అంటే ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, అవకాడో ఆయిల్ గుండెకు మేలు చేస్తాయి.

99

ఒబేసిటీ కూడా గుండె ప్రమాదాన్ని ఎక్కువగా పెంచుతుంది. కాబట్టి... ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తరచూ మీ బీఎంఐ చెక్ చేసుకుంటూ ఉండాలి. వ్యాయామం చేస్తూ.. బరువు కంట్రోల్ లో ఉంచుకోవాలి.

click me!

Recommended Stories