థైరాయిడ్ నొప్పి పెరిగితే వెంటనే ఏం చేయాలి?

First Published | Aug 18, 2024, 2:59 PM IST

థైరాయిడ్ సమస్య మన శరీరంలో ఎన్నో భాగాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ నొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే?
 

థైరాయిడ్ అనేది ఒక హార్మోన్. ఇది మన శరీరంలోని అనేక రకాల విధులను నిర్వహిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో చిన్న చిన్న పిల్లలకు కూడా థైరాయిడ్ సమస్య వస్తోంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు శరీరంలోని చాలా భాగాల్లో నొప్పి కలుగుతుంది. ఒక్కోసారి ఈ బాధను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఈ నొప్పిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

థైరాయిడ్ నొప్పి ఎక్కడొస్తుంది?

థైరాయిడ్ నొప్పి కాళ్లలో వస్తుంది. అలాగే కీళ్ల నొప్పులు,  కండరాల బలహీనత కారణంగా శరీర నొప్పి, చేతుల నొప్పి, గొంతు, గొంతు అడుగు భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలంటే? 

Latest Videos


bottle gourd juice

సొరకాయ జ్యూస్

సొరకాయను కూరగా చేసుకుని తినడమే కాదు.. దీని జ్యూస్ ను కూడా తాగొచ్చు. ఈ జ్యూస్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ వ్యాధి ఉంటే సొరకాయ జ్యూస్ ను ఖచ్చితంగా తాగండి. ఈ జ్యూస్ ను మీరు ఉదయం పరిగడుపున తాగితే థైరాయిడ్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

పచ్చి కొత్తిమీర

కొత్తిమీరలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని మీరు పచ్చిగా తింటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా థైరాయిడ్ పేషెంట్లు. అవును థైరాయిడ్ సమస్యలను తగ్గించడానికి పచ్చి కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు దీన్ని రోజూ జ్యూస్ గా లేదా చట్నీగా తినొచ్చు. కొత్తిమీర థైరాయిడ్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది. 
 

కొబ్బరి నీళ్లు 

థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. వీళ్లు కొబ్బరి నీళ్లను తాగితే థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. ఈ వాటర్ లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ థైరాయిడ్ నొప్పిని తగ్గిస్తాయి.
 

పసుపు 

పసుపు ఎన్నో రోగాలకు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇది థైరాయిడ్ తో బాధపడేవారికి కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు రాత్రి పడుకునే ముందు పసుపు పాలను తాగండి. ఈ పసుపు పాలు థైరాయిడ్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. 
 

తులసి, కలబంద రసం

తులసి, కలబంద రసం కూడా థైరాయిడ్ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు టీస్పూన్ల తులసి రసంలో అర టీస్పూన్ కలబంద రసాన్ని కలిపి తీసుకుంటే థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇధి ఇది హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. 
 

click me!