టవల్స్‌ని నెలల తరబడి వాడుతున్నారా? వాటిని మార్చకపోతే ఎన్ని చర్మ సమస్యలో తెలుసా?

Published : Feb 28, 2025, 12:06 PM IST

 Towels Avoid Skin Problems: టవల్స్ శుభ్రంగానే కనిపిస్తున్నాయని నెలల తరబడి వాడేస్తున్నారా? వీటి వల్ల ఎలాంటి చర్మ సమస్యలు వస్తాయో తెలుసా? రోజూ ఉపయోగించే టవల్స్‌ని ఎన్ని రోజుల తర్వాత వాడటం మానేయాలి? టవల్ వాడటానికి పని చేయదని ఎలా గుర్తించాలి? ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
టవల్స్‌ని నెలల తరబడి వాడుతున్నారా? వాటిని మార్చకపోతే ఎన్ని చర్మ సమస్యలో తెలుసా?

సాధారణంగా ఏదైనా టవల్ లేదా డ్రెస్, శారీ, ఇలా ఏ క్లాత్ మెటీరియల్ అయినా అవి చిరిగిపోయే దాకా వాడుతుంటారు కదా.. కొంత మంది చిరిగిపోయిన వాటిని కూడా కుట్టించుకుని వేసుకుంటారు. క్లాత్ లో నాణ్యత లేకపోవడం వల్ల ఆ చిరుగులు పడ్డాయని చాలామందికి తెలియదు. నాణ్యత లేని టవల్స్ వాడటం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

25

కారణం బ్యాక్టీరియా, ఫంగస్ 
ఎక్కువ కాలం ఒకే టవల్ ను ఉపయోగించడం వల్ల అందులో తడి, చెమట, స్కిన్ ఆయిల్స్ ఉండిపోతాయి. దీంతో బాక్టీరియా, ఫంగస్ పెరిగిపోతాయి. వాటినే నెలల తరబడి వాడితే దుర్వాసన కూడా వస్తాయి. అయినా పట్టించుకోకుండా వాడితే అనేక చర్మ సమస్యలు వస్తాయి. 

చర్మ సమస్యలు 
ఒకే టవల్ ఎక్కువ రోజులు ఉపయోగిస్తే  ముందుగా వచ్చే సమస్య మొటిమలు. మొహంపై రకరకాల మొటిమలు ఏర్పడి నల్లని మచ్చలుగా ఉండిపోతాయి. అంతే కాకుండా  అలెర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. కొంత మందిలో దద్దుర్లు, దురద కలిగే అవకాశం కూడా ఉంటుంది. తరచూ జలుబు బారిన పడుతున్నా అది మీరు ఉపయోగించే టవల్ వల్లే అయి ఉండొచ్చు. 

35

టవల్ ఎప్పుడు మార్చాలి..

రోజూ ఉపయోగించే టవల్‌ను 6 నెలల నుంచి 1 సంవత్సరం మధ్యలో మార్చడం ఉత్తమం. కానీ కొన్ని పరిస్థితులలో ముందే మార్చడం మంచిది.

1. దుర్వాసన వస్తే.. 
టవల్ బాగా ఉతకినా దుర్వాసన పోకపోతే అది బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగిందని అర్థం. వెంటనే ఆ టవల్ మార్చేయాలి. లేకపోతే మొహంపై దద్దుర్లు, మొటిమలు వస్తాయి. అంతేకాకుండా శరీరంలోని ఇతర భాగాల్లో దుర్వాసన పెరుగుతుంది. కాళ్లు, చేతుల్లో పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. 
 

45

2. రెండు సార్లు పైగా చిరిగిపోతే..
టవల్ గట్టిపడిపోయినా లేదా మృదుత్వం తగ్గిపోయినా కొత్త దాన్ని ఉపయోగించడం మంచిది. లేకపోతే చర్మంపై పగుళ్లు, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. 

3. రంగు మారిపోయినా, మచ్చలు పడినా.. 
టవల్స్ పై పడిన కొన్ని మచ్చలు ఎంత శుభ్రం చేసినా పోవు. అంటే టవల్స్ లో బ్యాక్టీరియా పెరిగిపోయిందని అర్థం. వెంటనే వాటిని వాడకపోవడం మంచిది.
 

55

ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి?
వారానికి 2-3 సార్లు వేడి నీటితో ఉతకాలి. సబ్బు లేదా వెనిగర్తో నెలకోసారి శుభ్రం చేయాలి. టవల్స్ ఎప్పుడూ బాగా ఆరనీయాలి. మొహానికి, బాడీకి వేర్వేరుగా టవల్స్ ఉండటం మంచిది. 
 

click me!

Recommended Stories