మందు తాగుతూ సిగరేట్లను కాల్చే అలవాటుందా? ఈ విషయం తెలిస్తే జీవితంలో మళ్లీ ఈ పని చేయరు..!

ఆల్కహాల్, స్మోకింగ్ ఆరోగ్యానికి ఎంత డేంజరో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. లేదంటే మీ చేజేతులారా మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకున్న వారవుతారు. కొందరైతే మందు తాగుతూ సిగరేట్ ను కాల్చుతుంటారు. ఈ విషయం తెలిస్తే జీవితంలో ఆ పని ఇక అస్సలు చేయరు తెలుసా? 
 

పార్టీలకు మందు పక్కాగా ఉండాల్సిందేనంటారు చాలా మంది. దీనికి తోడు ఒక చేత్తో మందు తాగుతూ.. మరో చేత్తో సిగరేట్ ను కాల్చే వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్ ను ఎక్కువగా ఫాలో అవుతోంది. ఆల్కహాల్, సిగరెట్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అయినా ఈ అలవాట్లను మానుకోని వారు చాలా మందే ఉన్నారు. మీకు తెలుసా?  మందు తాగుతూ సిగరేట్ ను కాల్చే అలవాటు మిమ్మల్ని ఎన్నో ప్రాణాంతక రోగాల బారిన పడేస్తుంది. 
 

ధూమపానం, మద్యపానం మధ్య సంబంధమేంటి? 

మందు తాగుతూ, సిగరేట్ ను కాల్చే అలవాటు ఎన్నో రోగాలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానం, మద్యపానం  దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.  సిగరేట్ లోని నికోటిన్ ఆల్కహాల్ ఆహ్లాదకరమైన ప్రభావాలను పెంచుతుందని పరిశోధన చూపిస్తుంది. అంటే మందు తాగిన తర్వాత సిగరెట్లు తాగాలనుకునేలా ఇది చేస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే? నికోటిన్, ఆల్కహాల్ ఒకే విధంగా పనిచేస్తాయి. అంటే వీటిని కలిపి తీసుకున్నప్పుడు సంకర్షణ చెందుతాయి. ధూమపానం, మద్యపానం రెండింటికీ ఒకే జన్యువు కారణం కావొచ్చు. అందుకే మందు తాగే వారు స్మోకింగ్ చేసే అవకాశం ఉంది. 
 


స్మోకింగ్ వల్ల కలిగే దుష్ప్రభావాలు

స్మోకింగ్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయన్న ముచ్చట అందరికీ తెలుసు. అయినా ఈ అలవాటును మాత్రం అస్సలు మానుకోరు. స్మోకింగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, సీఓపీడీతో పాటుగా ఎన్నో ఇతర  క్యాన్సర్లకు కారణమవుతుంది.
 


ఆల్కహాల్ వల్ల కలిగే దుష్ప్రభావాలు 

మందు తాగే అలావాటు చాలా మందికి ఉంటుంది. కొన్ని సార్లు ఇది ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది. కానీ రెగ్యులర్ గా, ఎక్కువగా తాగితే ఎన్నో రోగాలు వస్తాయి. మందును ఎక్కువగా తాగడం వల్ల నోరు, గొంతు, రొమ్ము క్యాన్సర్, స్ట్రోక్, మెదడు దెబ్బతినడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మందును ఎంత తాగినా ప్రమాకరమేనని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 


ధూమపానం, ఆల్కహాల్ కలయిక దుష్ప్రభావాలు 

హృదయ సంబంధ సమస్యల ప్రమాదం 

ఆల్కహాల్, స్మోకింత్ రెండూ గుండె సమస్యలను పెంచుతాయి. స్మోకింగ్ అథెరోస్క్లెరోసిస్ కు దారితీస్తుంది. అయితే మందును ఎక్కువగా తాగడం వల్ల కార్డియోమయోపతి, అధిక రక్తపోటు, సక్రమంగా లేని హృదయ స్పందన వంటి సమస్యలు వస్తాయి. ఆల్కహాల్, స్మోకింగ్ రెండూ కలిసి గుండె, ప్రసరణ వ్యవస్థపై ఒత్తిడిని ఎక్కువగా  కలిగిస్తాయి.
 

కాలేయ సమస్యలు 

మందును ఎక్కువగా తాగితే కాలేయం దెబ్బతింటుంది. అయితే స్మోకింత్ ఈ పరిస్థితిని మరింత ఎక్కువ చేస్తుంది. ఈ రెండు అలవాట్ల కలయిక కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే కాలెయ పనితీరు కూడా తగ్గుతుంది. 
 

 క్యాన్సర్ ప్రమాదం 

స్మోకింగ్, ఆల్కహాల్ రెండూ ఎన్నో రకాల క్యాన్సర్ల ప్రమాదంతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ రెండింటిని లిపినప్పుడు ప్రమాదం ఇంకా పెరుగుతుంది.  ముఖ్యంగా నోరు, గొంతు, అన్నవాహికకు సంబంధించిన ప్రాణాంతక క్యాన్సర్లు వస్తాయి.

Latest Videos

click me!