సైలెంట్ గుండెపోటుకు కారణాలు
అధిక బరువు
అధిక బరువు మీ గుండెపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల సైలెంట్ హార్ట్ ఎటాక్ తో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు ఊబకాయం అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ కు కూడా కారణమవుతుంది. ఇవి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.