కాకరకాయ నచ్చడం లేదా.. అయితే ఈ విషయాన్నీ వెంటనే తెలుసుకోండి!

First Published Oct 27, 2021, 9:01 PM IST

కాకరకాయ (Bitter gourd) పేరు విన్న వెంటనే చేదు (Bitter) రుచి గుర్తుకొస్తుంది. చాలామంది కాకరకాయను తినడానికి ఇష్టపడరు. కానీ ఇందులో ఉన్న చేదుగుణం అనేక ఆరోగ్య సమస్యలకు (Health problems) మందులాగా పనిచేస్తుంది. అయితే ఈ ఆర్టికల్ ఉద్దేశ్యం ఏంటంటే కాకరకాయ ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలుసుకోవడం.
 

కాకరకాయలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, పీచు, కొవ్వుపదార్థాలు, నీటి శాతం, విటమిన్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలు (Minerals) అధికంగా ఉన్నాయి. కాకరకాయ మెమోర్డిసిస్ యాంటీవైరల్ (Memordisis antiviral) అనే గుణాన్ని కలిగి ఉంటుంది.
 

ఇది తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం (Cold, Cough, Fever) తగ్గుతుంది. పొట్ట అల్సర్ లకు కారణమైన బ్యాక్టీరియాను చంపుతుంది. కాలేయ సమస్యలు, చర్మ వ్యాధులకు ( Liver problems, Skin problems) కాకరకాయ మంచి మందులాగా పనిచేస్తుంది.
 

కాకరకాయ ఎక్కువ తీసుకునే వారికి నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉన్న పీచు పదార్థం జీర్ణశక్తిని (Digestion) పెంచుతుంది. మలబద్దకం (Constipation) సమస్యలను తగ్గిస్తుంది.
 

కీళ్ల నొప్పులకు (Joint pains) కాకరకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాకరకాయ రసం తాగితే ఆడవారికి నెలసరి నొప్పులు (Periods pains) తగ్గుతాయి. కాకరకాయలో ఎక్కువగా ఉండే విటమిన్ ఎ కంటిచూపును (Eyesight) పెంచుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ ను నివారించే ఔషధగుణాలున్నాయి.
 

మూత్రపిండాలతో (Kidney) బాధపడేవారు తరచూ కాకరకాయ తింటే సమస్య తగ్గుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో గుండె సమస్యలు (Heart problems) తగ్గుతాయి.
 

ముఖం మీద మొటిమలు (Pimples) మచ్చలు కూడా తగ్గుతాయి. కాకరకాయ జ్యూస్ తాగితే షుగర్ (Diabetes) సమస్యలు తగ్గుతాయి. కాకరాకుల టీ తాగితే పొట్టలో చెడు పదార్థాలు తొలగిపోతాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కాబట్టి కాకరకాయలను తినడానికి అలవాటు చేసుకోవడం మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

click me!