ఎండాకాలంలో ఎసిడిటీ తగ్గాలంటే..

Published : May 12, 2023, 05:10 PM IST

మనం తీసుకునే ఆహారం ద్వారే ఎసిడిటీ సమస్య వస్తుంది. అయితే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ను నియంత్రించడానికి కొన్ని ఆహారాలు ఎంతో సహాయపడతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..  

PREV
16
ఎండాకాలంలో ఎసిడిటీ తగ్గాలంటే..

సాధారణంగా గుండెల్లో మంటకు కారణమయ్యే ఆహారాన్ని తీసుకున్నప్పుడు అన్నవాహిక స్పింక్టర్ రిలాక్స్ అవుతుంది. కానీ ఇది జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది. ఆహారం కడుపులో ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది. అప్పుడప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సమస్య రావడం సర్వ సాధారణం అయినప్పటికీ.. కొంతమందికి ఈ  సమస్య ఎప్పుడూ వస్తుంది. కడుపు ఉబ్బరం, బెల్చింగ్ వంటి సమస్యలు వస్తాయి. వేయించిన, ఫాస్ట్ ఫాస్ట్ గా తినడం, జున్ను, కొవ్వు మాంసాలు వంటి కొవ్వు, ఉప్పు లేదా మసాలా ఎక్కువ ఉన్న ఆహారాల వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. అయితే కొన్ని ఆహారాలు యాసిడ్ రిప్లెక్స్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే..

26

బియ్యం

బియ్యాన్ని మూడు పూటలా తినేవారున్నారు. అయితే బియ్యం, పాస్తా వంటి బ్లాండ్ పిండి పదార్థాలు  ఈ సమస్యను నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి. బియ్యం తేలికగా జీర్ణం అవుతాయి. అసౌకర్య లక్షణాలను ప్రేరేపించవు. దీనిలో ప్రీబయోటిక్ ఫైబర్ ఉండటం వల్ల గుండెల్లో మంట వంటి లక్షణాలను తగ్గించడానికి ఇది సహాయపడుతుందని కొంతమంది పరిశోధకులు అంటున్నారు.
 

36

అరటి

పొటాషియానికి అరటి పండు అద్భుతమైన వనరు. ఈ పండు ఆమ్ల ఉత్పత్తిని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అరటిపండ్లలో ఆల్కలీన్ మాత్రమే కాదు కరిగే ఫైబర్ అయిన పెక్టిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారాన్ని కదిలించడానికి సహాయపడుతుంది.

46
Image: Getty

దోసకాయ

దోసకాయలు ఆల్కలీన్ ఆహారం. అందుకే పీహెచ్ విలువను పెంచడం ద్వారా శరీరంలోని ఆమ్లాన్ని తటస్తం చేస్తాయి. అలాగే కీరదోసకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీనిలో సుమారుగా 95% వాటర్ కంటెంట్ ఉంటుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 
 

56

సబ్జా సీడ్స్

 సబ్జా గింజలు శరీరానికి నేచురల్ కూలెంట్ గా పనిచేస్తాయి. అలాగే ఎసిడిటీ, గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. ఈ గింజలను నీటిలో నానబెట్టినప్పుడు వాటి శ్లేష్మం కంటెంట్ పెరుగుతుంది. అవి మీ కడుపులోని అదనపు ఆమ్లాలను తటస్తం చేయడానికి సహాయపడతాయి.
 

66
potato

రూట్ కూరగాయలు

రూట్ కూరగాయల్లో పిండి కూరగాయలు, ఆరోగ్యకరమైన సంక్లిష్ట పిండి పదార్థాలు, జీర్ణమయ్యే ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చికాకు, గుండెల్లో మంట వంటి లక్షణాలను ప్రేరేపించవు. అదనపు నూనె లేదా సుగంధ ద్రవ్యాలతో వాటిని ఉడికించొద్దు. ఎందుకంటే ఇవి యాసిడ్ రిఫ్లక్స్ ను ప్రేరేపిస్తాయి. రూట్ కూరగాయలలో బంగాళాదుంపలు, చిలగడదుంపలు, క్యారెట్లు, దుంపలు ఉన్నాయి.

click me!

Recommended Stories