ఇవి మానేస్తే.. మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది తెలుసా?

Published : May 05, 2023, 02:51 PM IST

ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి.  అయితే జీవనశైలి అలవాట్లను చేసుకుంటే ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.   

PREV
16
 ఇవి మానేస్తే.. మీకు క్యాన్సర్ వచ్చే  అవకాశం తగ్గుతుంది తెలుసా?
cancer

క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ ప్రాణాంతక వ్యాధి వంశపారంపర్యంగా కూడా రావొచ్చు. కాబట్టి  క్యాన్సర్ ను దూరం చేసుకోవాలంటే చిన్న వయసు నుంచే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

26
Image: Getty

ధూమపానం మానుకోవాలి

ధూమపానం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది స్మోకింగ్ ను మానేసి పొగరాని పొగాకును వాడుతారు. ఇది నోటి, గొంతు క్యాన్సర్ కు ప్రధాన కారణాలలో ఒకటని నిపుణులు చెబుతున్నారు. అందుకు పొగాకుకు వీలైనంత దూరంగా ఉండండి. స్మోకింగ్ చేస్తే గుండె, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. అందుకే ఈ అలవాటును మానుకోండి. 
 

36
Image: Getty

మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు

చర్మ క్యాన్సర్ కు ఎన్నో కారణాలున్నాయి. అయితే మండే ఎండలు కూడా ఈ క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి. మధ్యాహ్నం సమయంలో.. సూర్య కిరణాలు తీవ్రంగా ఉన్న 12 , 4 గంటల మధ్య సూర్యుడికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే చర్మ క్యాన్సర్ ముప్పు తప్పుతుంది. 
 

46
Image: Getty

సురక్షితమైన సెక్స్ 

శృంగారంలో పాల్గొనేటప్పుడు ప్రమాదకరమైన శృంగారంలో పాల్గొనడం మానుకోండి. కండోమ్ లేకుండా సెక్స్ లో పాల్గొనకండి. అలాగే తరచుగా భాగస్వామి మార్చే అలవాటును మానుకోండి. అసురక్షిత సంభోగం వల్ల హెచ్ఐవి వస్తుంది. అలాగే పాయువు, యోని, పురుషాంగం క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. 

56
Image: Getty

ఆరోగ్యంగా తినండి

తాజా పండ్లు, కూరగాయలు, గింజలను పుష్కలంగా తినండి. ప్రాసెస్ చేసిన, అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండండి. ఒకవేళ మీరు స్థూలకాయులు అయితే బరువు తగ్గడానికి ప్రయత్నించండి.  ఎందుకంటే బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు క్యాన్సర్ వంటి అనారోగ్యాలకు, ఇతర వ్యాధులకు ఎక్కువగా గురవుతారు.
 

66
Image: Getty

ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండండి

ప్రాసెస్ చేసిన మాంసాన్ని తింటే ఎన్నో ప్రమాదకరమైన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీటిలో క్యాన్సర్ ను కలిగించే కారకాలు ఉంటాయి. ఇకపోతే ఆల్కహాల్ సాధారణ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దీన్ని ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాలు, పెద్దప్రేగు, కాలేయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. 
 

click me!

Recommended Stories