పరిగడుపున బ్రెడ్ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 6, 2024, 4:44 PM IST

చాలా మందికి ఉదయాన్నే పరిగడుపున చాయ్ తో పాటుగా బ్రెడ్ తినే అలవాటు ఉంటుంది. ఇక కొంతమంది అయితే ఏకంగా బ్రెడ్ నే తింటుంటారు. కానీ పరిగడుపున బ్రెడ్ తింటే ఏం జరుగుతుందని ఎప్పుడైనా తెలుసుకున్నారా?

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అందుకోసం ఎన్నెన్నో చేస్తుంటారు. కానీ మీరు చేసే కొన్ని తప్పులే మిమ్మల్ని ఎన్నో రోగాల బారిన పడేలా చేస్తాయి. ముఖ్యంగా ఉదయం. అవును చాలా మంది ఉదయం పరిగడుపున బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తో చేసిన టోస్ట్ లేదా శాండ్విచ్లను తింటుంటారు. నిజానికి ఈ రెండూ ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే త్వరగా రెడీ అవుతాయి. కానీ ప్రతిరోజూ మీరు ఉదయం పరిగడుపున వీటిని తింటే మాత్రం మీ ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. అవును బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఫాస్ట్ గా పెంచడమే కాకుండా.. మిమ్మల్ని ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ను తింటే ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

డయాబెటిస్..

పరిగడుపున మీరు బ్రెడ్ ను తింటే మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం చాలా పెరుగుతుంది. ఇక మీకు ఇప్పటికే షుగర్ ఉన్నట్టైతే మీరు మర్చిపోయి కూడా పరిగడుపున బ్రెడ్ ను తినకూడదు. నిజానికి వైట్ బ్రెడ్ త్వరగా జీర్ణమై గ్లూకోజ్ గా మారుతుంది. ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను ఫాస్ట్ గా పెంచుతుంది. అంతేకాకుండా బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది మీ శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో బ్రెడ్ ను తినకూడదు. దీనికి బదులుగా ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. 
 


బరువు

మీరు బరువు పెరగొద్దు అనుకుంటే మాత్రం మర్చిపోయి కూడా పరిగడుపున బ్రెడ్ ను తినకూడదు. ఎందుకంటే బ్రెడ్ లో ఉండే ఎక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్లు మీ బరువును మరింత పెంచుతాయి. అంతేకాకుండా ఖాళీ కడుపుతో బ్రెడ్ ను తినడం వల్ల మీకు చాలా త్వరగా ఆకలి అవుతుంది. త్వరగా జీర్ణమయ్యే బ్రెడ్ కొన్ని కొన్నిసార్లు అతిగా తినడానికి దారితీస్తుంది. ఇది మిమ్మల్ని ఊబకాయం బారిన పడేస్తుంది. అందుకే ఉదయం బ్రెడ్ కు బదులుగా పండ్లు, కూరగాయలు లేదా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. 
 

మలబద్ధకం

ఉదయాన్నే పరిగడుపున బ్రెడ్ ను తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే బ్రెడ్ ను పిండితో తయారు చేస్తారు. దీన్ని తినడం వల్ల మలం గట్టిపడుతుంది. అలాగే కడుపు  శుభ్రం చేయబడదు. ఈ సమస్య మలబద్ధకానికి దారితీస్తుంది. ఒక ఇప్పటికే మలబద్దకం సమస్య ఉన్నట్టైతే ఉదయాన్నే బ్రెడ్ ను తినడం మానుకోండి. 
 

మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది

బ్రెడ్ టేస్టీగా అనిపించొచ్చు. కానీ ఇది మీ మానసిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.  అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ 2015 లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం.. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల వినియోగం అంటే బ్రెడ్ , నిరాశ మధ్య సంబంధం ఉందని నివేదించింది. చక్కెర స్థాయిలో మార్పులకు కారణమయ్యే హార్మోన్ల మార్పులు మీ మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి మీరు ప్రతిరోజూ బ్రెడ్  తింటున్నట్టైతే మీకు అలసట, నిరాశ లక్షణాలు ఉంటాయి. 

గ్యాస్ట్రిక్ సమస్యలు

మీకు ఇప్పటికే గ్యాస్, అజీర్ణం లేదా అసిడిటీ వంటి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్టైతే మీరు పొరపాటున కూడా పరిగడుపున బ్రెడ్ ను తినకండి. ఎందుకంటే పరిగడుపున బ్రెడ్ తినడం వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.

Latest Videos

click me!