ఏ డ్రై ఫ్రూట్స్ ను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలి?

First Published | Jul 30, 2024, 4:33 PM IST

డ్రై ఫ్రూట్స్ లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే కాకుండా నానబెట్టి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామని డాక్టర్లు చెప్తున్నారు. మరి ఏయే డ్రై ఫ్రూట్స్ ను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

ఆరోగ్యంగా ఉండటానికి మనం ఎన్నో అన్నం, కూరగాయలతో పాటుగా ఎన్నో అహారాలను తింటుంటాం. హెల్తీగా ఉండటానికి చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను కూడా తింటుంటారు. నిజానికి డ్రై ఫ్రూట్స్ ను తింటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే వీటిని అలాగే కాకుండా.. నీళ్లలో నానబెట్టి తింటే మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తింటే మీ శరీరం ఫిట్ గా ఉంటుంది. ఎన్నో వ్యాధులకు కూడా దూరంగా ఉంటుంది. మన శరీరాకిని వ్యాధులతో పోరాడే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇందుకోసం ఏయే డ్రై ఫ్రూట్స్ ను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బాదం 

బాదం పప్పులను నానబెట్టి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ప్రతిరోజూ రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తినడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో  మన శరీరం రోగాలకు దూరంగా ఉంటుంది.  అలాగే నానబెట్టిన బాదం పప్పులు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 
 


అంజీర పండు 

అంజీర పండ్లలో కూడా మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు రోజూ రాత్రిపూట ఒక డ్రై అంజీరను నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అంజీరలో పీచు, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. 
 

ఎండుద్రాక్ష 

ఎండుద్రాక్షలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని అలాగే తినకుండా.. రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలి. దీనివల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ శరీరంలో ఐరన్ లోపం కూడా తొలగిపోతుంది. అలాగే మీ శరీరంలో ఎనర్జీ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. 
 

లీన్ సీడ్ 

లీన్ సీడ్స్ కూడా రాత్రంతా నానబెట్టి తింటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఒక టీస్పూన్ లిన్ సీడ్ ను రాత్రిపూట నీటిలో నానబెట్టండి. దీన్ని ఉదయాన్నే తినండి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే డయాబెటిస్ ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది. 
 

మెంతులు

మెంతులను కూడా మీరు నానబెట్టి తినొచ్చు. కొన్ని మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు. ఈ మెంతి వాటర్ ఆడవాళ్లకు ఓ వరం.  ఇది మహిళలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ వాటర్ ను తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు కూడా రావు. 
 

Latest Videos

click me!