నానపెట్టిన ఎండు ద్రాక్ష.. మ్యాజిక్ చేస్తాయి..!

First Published Mar 1, 2021, 12:59 PM IST

ఈ ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండటమేకాకుండా, సహజసిద్ధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అంటున్నారు.

ద్రాక్ష పండ్లను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వీటిని ఇష్టంగా తినేస్తారు. అయితే, పచ్చి ద్రాక్షలో కంటే ఎండు ద్రాక్షలోనే పోషకాలు పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెపుతున్నారు.
undefined
అందుకే రోజుకు 5 ఎండు ద్రాక్షలను తింటే చాలని వారు అంటున్నారు. దీనికి కారణం ఈ ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండటమేకాకుండా, సహజసిద్ధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఈ ఎండు ద్రాక్ష ఆరగిస్తే కలిగే లాభాలను ఓసారి పరిశీలిద్ధాం.
undefined
ఇందులో ఉండే ఫైబర్ వల్ల ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలు, 10 ఎండు ద్రాక్షలు తీసుకోవడం వల్ల ఉదర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
undefined
ఎండు ద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా మెరుగుపడుతుంది. ఒక గ్లాసు నీటిలో `10 నుండి 12 ఎండు ద్రాక్షలను వేసి, రాత్రంతా నానబెట్టాలి. వీటిని మిక్సీలో పేస్ట్ చేసి ఉదయం నేరుగా పరగడుపున తీసుకోవడం వల్ల జీర్ణశక్తిపెరుగుతుంది..
undefined
పొటాషియం నరాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
undefined
ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ప్రతి రోజూ ఓ కప్పు నీటిలో 10 నుంచి 15 ఎండు ద్రాక్షలను నానబెట్టాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. 4 - 5 గంటల తర్వాత ఎండు ద్రాక్షను నమలాలి. ఇలాక్రమం తప్పకుండా చేస్తే అనీమియా వ్యాధి దూరమవుతుంది.
undefined
ఎండు ద్రాక్షలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి పళ్లను, చిగుళ్లను దృఢంగా ఉండేలా చేస్తాయి.* యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కేన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి.
undefined
ఎండు ద్రాక్షను క్రమం తప్పకుండా ఆరగించడం వల్ల ఇందులోని క్యాల్షియం కీళ్ల నొప్పులను మటుమాయం చేస్తుంది.* అన్నిటికంటే ముఖ్యంగా, ప్రతిరోజు ఎండు ద్రాక్షను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పోతాయి. కాలేయ సంబంధ సమస్యలను నివారిస్తుంది.
undefined
ఎండు ద్రాక్షలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపడటానికి సాయపడతాయి.
undefined
పిల్లల శరీరానికి ఎండుద్రాక్ష సహజమైన వేడిని అందిస్తుంది. దీనివల్ల పిల్లలు రాత్రిపూట పక్కలో మూత్రవిసర్జన చేయరు.
undefined
ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
undefined
click me!