నువ్వులలో పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు 41%, మోనోశాచురేటెడ్ కొవ్వులు 39% వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. నువ్వుల్లో ఇతర ఖనిజాలు, పోషకాలతో పాటు ఇనుము, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. నువ్వులు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే రక్త కణాల నిర్మాణానికి సహాయపడతాయి.