లవంగాలు ప్రతి వంటింట్లో ఉపయోగించే సాధారణ మసాలా దినుసు. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి దగ్గు, జ్వరం, కఫాన్ని తగ్గిస్తాయి. లవంగాలు వైరస్ లు, బ్యాక్టీరియా, వివిధ రకాల శిలీంధ్రాలు మొదలైన వాటికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. లవంగాలను మరిగించిన నీటిని తాగితే గ్యాస్ ట్రబుల్ తొందరగా తగ్గుతుంది. భోజనం తర్వాత మీ నోట్లో లవంగాలను వేసుకుని నమలడం వల్ల ఎసిడిటీని తగ్గిపోతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.