పోషకాల గని.. 'డ్రాగన్ ఫ్రూట్'లో ఎన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా?

Navya G   | Asianet News
Published : Feb 26, 2022, 02:22 PM IST

డ్రాగన్ ఫ్రూట్ (Dragon Fruit) చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని తొక్క గులాబీ రంగులో ఉండి డ్రాగన్ చర్మాన్ని పోలి ఉంటుంది. కనుక దీన్ని డ్రాగన్ ఫ్రూట్ గా పిలుస్తారు. డ్రాగన్ ఫ్రూట్ ను మెక్సికో, దక్షిణ అమెరికా వంటి దేశాలలో ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పండును తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
18
పోషకాల గని.. 'డ్రాగన్ ఫ్రూట్'లో ఎన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా?
Dragon Fruit

డ్రాగన్ ఫ్రూట్ పైన గులాబీ రంగులో లోపలిభాగం తెల్లని గుజ్జుతో నల్లని చిన్న విత్తనాలతో ఉంటుంది. ఒక కప్పు డ్రాగన్ ఫ్రూట్ గుజ్జు నుంచి సుమారు 136 కేలరీలు (Calories) అందుతాయి. అలాగే 29 శాతం పిండిపదార్థం, 3 గ్రా మాంసకృత్తులు, 7 గ్రా పీచు, 8 శాతం ఇనుము ఉంటాయి. ఇది జీరో ఫ్యాట్ (Zero fat) ను కలిగి ఉంటుంది.

28
Dragon Fruit

అంతేకాకుండా ఇందులో విటమిన్లు, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ ఫ్రూట్ ను పోషకాల గని (Mine of nutrients) అని పిలుస్తారు. మిగతా పండ్ల మాదిరే ఇందులో యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) శరీరానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.

38
Dragon Fruit

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: డ్రాగన్ ఫ్రూట్ లో పీచుపదార్థం (Fiber) సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను (Digestive system) ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే పేగులలో పేరుకుపోయిన మలాన్ని తేలిక పరిచి మలవిసర్జన సాఫీగా జరిగేందుకు సహాయపడి మలబద్ధకం సమస్యలను కూడ తగ్గిస్తుంది.

48
Dragon Fruit

బరువును నియంత్రిస్తుంది: డ్రాగన్ ఫ్రూట్ గింజలు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు (Omega-3 fatty acids) అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతాయి. అలాగే ఈ పండులో కొవ్వు పదార్థాలు అస్సలు ఉండవు. కనుక ఈ పండును తీసుకుంటే బరువును నియంత్రిస్తుంది (Controls weight).

58

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: డ్రాగన్ ఫ్రూట్ లో పిటియా (Pitia) అనే పోషకం శరీరానికి కావలసిన శక్తిని అందించి రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది. అలాగే విటమిన్ సి, కెరొటినాయిడ్స్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడతాయి. కనుక డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకుంటే  ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

 

 

68

క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది: డ్రాగన్ ఫ్రూట్ క్యాన్సర్ (Cancer) వంటి ప్రాణాంతకమైన వ్యాధులనుంచి రక్షించే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల (Cancer cells) వ్యాప్తిని అడ్డుకుని వివిధ రకాల క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి.

78

చర్మ సమస్యలను తగ్గిస్తుంది: చర్మపు ఆరోగ్యాన్ని (Skin health) పెంచే గుణాలను డ్రాగన్ ఫ్రూట్ కలిగి ఉంటుంది. మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు, ముడుతలు వంటి చర్మ సమస్యలను తగ్గించి యవ్వనంగా కల్పించేందుకు సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని మృదువుగా (Softens the skin) మారుస్తుంది.

88
dragon fruit

అంతేకాకుండా ఈ పండును తీసుకుంటే దగ్గు, ఆస్తమా (Asthma), చర్మం పై గాయాలు, కంటి సమస్యలు, కీళ్ల నొప్పులు, దంత సమస్యలు, గుండె పోటు (Heart attack) వంటి ఇతర సమస్యలు తగ్గుతాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నా డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

click me!

Recommended Stories