ఉదయం ఉడకబెట్టిన గుడ్డును తింటే ఎంత మంచిదో..!

First Published | Sep 20, 2023, 7:15 AM IST

ఉడకబెట్టిన గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లు ప్రోటీన్ కు మంచి వనరు. అందుకే చాలా మంది గుడ్లను రెగ్యులర్ గా తింటుంటారు. అయితే గుడ్లను రకరకాల వండి తింటారు. కానీ వీటిని ఉడకబెట్టి తింటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఆదివారమైనా, సోమవారమైనా రోజూ తినండి గుడ్లు అన్న మాటను వినే ఉంటారు. ఎందుకంటే గుడ్డు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్లు పోషకాల పవర్ హౌస్. అందుకే దీన్ని సంపూర్ణ ఆహారం అంటారు. గుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి 12, రిబోఫ్లేవిన్, సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 
 

గుడ్లలో ఉండే పోషకాలు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. అలాగే ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి చాలా మందికి తెలుసు. నేడు చాలా మంది రోజూ గుడ్లను తింటున్నారు. కానీ వీటిని వివిధ పద్దతుల్లో వండి తింటుంటారు. చాలా మంది అయితే గుడ్లును ఆమ్లేట్ రూపంలోనే తింటుంటారు. కానీ దీనిని ఉడకబెట్టి తింటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


కళ్లకు మేలు 

ఉడికించిన గుడ్లలో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా గుడ్డులో ఉండే సమ్మేళనాలు వృద్ధాప్యంలో కంటిశుక్లం వంటి కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. ఉడకబెట్టిన గుడ్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి సమస్యల ముప్పును తగ్గిస్తుంది. 
 

గుండె ఆరోగ్యం 

గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే రోజుకు ఒక గుడ్డును తినడం వల్ల కొలెస్ట్రాల్ ఏమీ పెరగదని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. గుడ్డులో ఉండే పుష్కలమైన ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు వారానికి ఏడు ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల కొన్ని రకాల స్ట్రోక్ ముప్పు తప్పుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. 

బరువును నియంత్రిస్తుంది

బరువు తగ్గాలనుకునే వారికి ఉడకబెట్టిన గుడ్డు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును ఉడకబెట్టిన గుడ్లను తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది మిమ్మల్ని అతిగా తినకుండా కాపాడుతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

మంచి జుట్టు, చర్మం

ఉడికించిన గుడ్లలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి మన చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. గుడ్లలో ఉండే బయోటిన్ జుట్టును బలంగా, ఒత్తుగా చేసత్ుంది. అలాగే గోర్లను కూడా ఆరోగ్యంగా చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేయడానికి కూడా సహాయపడుతుంది. గుడ్లలో ఉండే పొటాషియం మొటిమలు, మచ్చలు, చర్మం టానింగ్  వంటి చర్మ సమస్యలను దూరం చేస్తుంది.

గుడ్లలో కోలిన్ అనే ముఖ్యమైన పోషకం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. గుడ్డు పచ్చసొన పోషణకు మంచి మూలం. ఇది మన మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్, జ్ఞాపకశక్తికి సంబంధించిన విధులను పెంచడానికి సహాయపడుతుంది.

Latest Videos

click me!