పాలను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. ఎందుకంటే పాలు మన దంతాలను, ఎములను బలంగా ఉంచుతాయి. అంతేకాదు శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. కానీ పాలలో చిటికెడు పసుపును కలిపి తాగడం ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పసుపులోని కర్కుమిన్ కంటెంట్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ పసుపు గుండె జబ్బులు, క్యాన్సర్, వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..