నారింజ తొక్కలో కూడా ఎన్నో ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. నారింజ తొక్క మొటిమలను తొలగించడానికి, నల్లటి మచ్చలను పోగొట్టడానికి, జిడ్డుగల చర్మాన్ని తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం నారింజ తొక్కను ఎండబెట్టి పొడి రూపంలో తీసుకోవాలి. పొడి చేసిన నారింజ తొక్కలను గాలివెళ్లని కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఉపయోగించి ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక చెంచా నారింజ పొడిలో చిటికెడు పసుపు, ఒక చెంచా తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత రోజ్ వాటర్ తో కడిగేయాలి. ఈ ప్యాక్ చుండ్రును తొలగించి ముఖాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది.