చల్లని ఆహారాలను తినడం, తాగడం మానుకోండి
ఈ సీజన్ లో కూడా చల్లటి ఆహారాలను తినేవారు, పానీయాలను తాగేవారు చాలా మందే ఉన్నారు. వర్షాకాలంలో సమ్మర్ కూలర్లను వాడినా, ఐస్క్రీమ్లను తిన్నా గొంతు, చెవి ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. నిజానికి చల్లని వాటిని తినడం వల్ల గొంతు నుంచి ఇన్ఫెక్షన్ చెవికి చేరుతుంది. దీంతో చెవిలో నొప్పి, దురద సమస్య పెరుగుతుంది.