
వాతావరణాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితులు కూడా మారిపోతాయి. అందుకే ప్రతి సీజన్ లో మనం తినే ఆహారాన్ని, జీవనశైలిని సర్దుబాటు చేసుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు. కానీ చాలా మంది దీనిపై పెద్దగా దృష్టి పెట్టరు. దీనివల్లే ఎన్నో అనారోగ్య సమస్యలను పేస్ చేస్తారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి త్వరగా చెమటలు పట్టడంతో పాటు అడపాదడపా మూత్ర విసర్జన చేయొచ్చు. ఇవన్నీ శరీరంలో డీహైడ్రేషన్ కు దారితీస్తాయి. అందుకే శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గకుండా జాగ్రత్త పడాలి. అయితే కొన్ని ఆహారాలు మనల్ని డీహైడ్రేషన్ బారిన పడేస్తాయి. అందుకే అలాంటి వాటిని తినకూడదు. ఈ ఎండాకాలంలో ఎలాంటి ఆహారాలను తినకూడదంటే..
ఊరగాయ
ఎండాకాలంలో ఉప్పుగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఊరగాయల్లో ఎక్కువ మొత్తంలో సోడియం ఉంటుది. సోడియం నిర్జలీకరణానికి దారితీస్తుంది. ఈ నిర్జలీకరణం అలసట, మైకము వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.
కాఫీ
కాఫీ తక్షణ శక్తిని ఇస్తుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ చాలా మంది దాహం వేసినప్పుడు కాఫీ లేదా టీలను తాగుతుంటారు. కాఫీ తాగితే శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గుతుంది. ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. అందుకే కాఫీ, టీలకు బదులుగా నీళ్లను పుష్కలంగా తాగండి.
మిల్క్ షేక్స్
మండుతున్న ఎండల్లో చాలా మంది ఏదైనా చల్లగా తింటుంటారు. అందులో చాలా మంది మిల్క్ షేక్ ను ఎక్కువగా ఇష్టపడతారు. అందులోనూ ఇది ఆరోగ్యకరమైంది. టేస్టీగా ఉంటుందని ఎక్కువగా తాగుతుంటారు. నిజమేంటంటే ఎండాకాలంలో మిల్క్ షేక్ లను తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే బయట నుంచి కొనే మిల్క్ షేక్స్ అన్నింటిలోనూ ఎక్కువ మొత్తంలో స్వీట్లు ఉంటాయి. ఇది నిర్జలీకరణానికి కారణమవుతుంది.
స్పైసీ ఫుడ్
ఎండాకాలంలో స్పైసీ ఫుడ్ ను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ ఫుడ్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అలాగే అసౌకర్యం, అలసట, జీర్ణ సమస్యలు, నిర్జలీకరణానికి కారణమవుతుంది.
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిని తింటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇవి ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ.. డ్రై ఫ్రూట్స్ ను ఎండాకాలంలో ఎక్కువగా తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి శరీర ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతాయి. ఇది అసౌకర్యం, అలసటను కలిగిస్తుంది.
కాల్చిన మాంసం
గ్రిల్డ్ మాంసాన్ని ఎండాకాలంలో తినకపోవడమే మంచిది. ఎందుకంటే బయట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని తింటే ఇది కూడా శరీరం లోపల వేడిని పెంచుతుంది. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.
వేయించిన ఆహారాలు
వేయించిన ఆహారాలను కూడా ఎండాకాలంలో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. సమోసా, చాట్, ఫ్రైస్ వంటి స్నాక్స్ అయినా సరే. ఎందుకంటే ఇవి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. వీటిని తింటే ఎండాకాలంలో నిర్జలీకరణానికి దారితీసే అవకాశం ఉంది.
సోడా
ఎండాకాలంలో సోడా, లేదా బాటిల్స్ లో వచ్చే కార్బోనేటేడ్ పానీయాలను తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి నిర్జలీకరణానికి కూడా కారణమవుతాయి.
ఆల్కహాల్
ఎండాకాలంలో మందును తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది తలనొప్పి, అలసట, నోరు పొడిబారడం, శరీర ఉష్ణోగ్రత పెరుగుదలకు దారితీస్తుంది.